అమెజాన్ మొదటి సారి ఇండియాతో సహా మరొక 12 దేశాలలో ప్రైమ్ డే సేల్ ఆఫర్ ప్రకటించింది. ఎన్ని అవకాశాలో ప్రైమ్ మెంబర్లకు. ఒకటి కొొంటే మరొకటి ఉచితం. కొన్నిం టి మీద  క్యాష్ బ్యాక్, కొన్నింటి మీద భారీ డిస్కైంట్. అమెజాన్ పండగ ఈ సాయంకాలం మొదలయి రేపటి దాకా సాగుతుంది.

అమెజాన్ భారత దేశంలో బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఫ్రైమ్ డే సేల్ పేరుతో మొట్టమొదటి సారిగా ఇండియాలో ఈ ఆఫర్ ను అందిస్తున్నది. ప్రైమ్‌ డే సేల్‌ సోమవారం (జులై10) సాయంత్రం 6 గంటలనుంచి ప్రారంభమవుతుంది. ఒకటి కంటే ఒకటి ఫ్రీ , అనేది ఈ ఆఫర్ .స్మార్ట్‌ఫోన్లు మొదలుకుని ఎలక్ట్రానిక్ పరికరాల దాకా ఈ భారీ ఆఫర్ వర్తిస్తుంది.

టీవీ కొనుగోలు చేసిన ప్రైమ్‌ ఖాతాదారులకు మరో టీవీని ఉచితంగా అందిస్తారు. ‘ప్రైమ్’ సేల్‌ లోపేరు మోసిన 20 టాప్ బ్రాండ్లతోపాటు అన్ని ఉత్పత్తులపై డిస్కౌంట్లను అందిస్తున్నామని అమెజాన్‌ ప్రైమ్‌ హెడ్‌ అక్షయ్‌ సాహీ ప్రకటించారు. ఇండియాతో పాటు మరొక 12 దేశాలలో ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఈ రోజు సాయంకాలం అరుగంటలకు సేల్ మొదలయినా, మెయిన్ సేల్ డే మంగళవారమే. ఒక షరతు, ఇది అమెజాన్ ఫ్రయిమ్ సభ్యులకు మాత్రమే. యేడాదికి రు.499 చెల్లించి ప్రైమ్ సభ్యత్వం ఏవరయినా తీసుకుకోవచ్చు.

ఆఫర్ లో షియోమి రెడ్ మి 4 ఫోన్ కూడా ఉంది. దీనిధర రు. 6999. దీని ఓపెన్ సేల్ ఈ రోజు అయిదుగంటలకు మొదలవుతుంది. ప్రైమ్ సేల్ ఆకర్షణ నుబియా ఎం 2. హెచ్ డి ఎఫ్ సి కార్డు మీద కంటే వినియోగదారులకు రు. 2000 దాకా క్యాష్ బ్యాక్ ఉంటుంది.

బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ బ్రాండ్ ‘బీయింగ్ హ్యూమన్’ ఈ-సైకిల్స్ ప్రత్యేకంగా లాంచ్‌ చేస్తున్నారు. అలాగే TCL TV సెట్లలో మరో ‘బై వన్‌ గెట్ వన్‌ ఫ్రీ ‘ అగ్రిమెంట్ ను అమెజాన్ కుదుర్చుకుంది. దీని ప్రకారం ప్రైమ్‌ వినియోగదారులు 4కే ప్యూర్ ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ (55 అంగుళాలు) పై TCL HD రెడీ టీవీ (32 అంగుళాలు)పొందవచ్చు. భారత్‌ తోపాటు మరో 12 దేశాల్లో ప్రైమ్‌ డే సేల్‌ ను నిర్వహిస్తోంది అమేజాన్.