ప్రముఖ ఈ-కామర్స్ వెబ్ సైట్ అమేజాన్.. నిరుద్యోగులకు ఓ శుభవార్త తెలియజేసింది. 50వేల ఉద్యోగాలను ఇవ్వనున్నట్లు ప్రకటించింది. వివరాల్లోకి వెళితే... అమేజాన్ సంస్థ తమ కంపెనీని విస్తరించే పనిలో పడింది. అమెరికా ప్రధాన మెట్రో నగరాలైన న్యూయార్క్, లాస్ ఏంజిల్స్, వాషింగ్టన్ డీసీతో పాటు ముఖ్యంగా నార్త్ కరోలినా, కొలంబస్, ఒహియో  లాంటి చిన్న నగరాల్లో కూడా అమెజాన్‌ సెకండ్‌ హెడ్‌ క్వార్టర్స్‌ ను ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేసింది.  కెనడాలోని ఓ పెద్ద నగరం సహా మొత్తం 20 ముఖ్య నగరాల్లో అమేజాన్ బ్రాంచ్ లను పెట్టాలని నిర్ణయించింది. 5 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో ఈ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ బ్రాంచ్ ల ద్వారా తమ సంస్థ నిరుద్యోగులైన 50వేల మందికి ఉద్యోగ అవకాశాలను కల్పించనున్నట్లు అమెజాన్ అధికారికంగా ప్రకటించింది. మొత్తం 238 సెంటర్లను పరిశీలించి.. చివరికి 20 సెంటర్లను ఏంపిక చేసినట్లు సంస్థ తెలిపింది.