ప్రముఖ ఇండియన్ ఈకామర్స్ వెబ్ సైట్ ఫ్లిప్ కార్ట్ .. మరో దిగ్గజ ఈ కామర్స్ వెబ్ సైట్ అమేజాన్ కి హస్తగతం కానుంది. ఆన్ లైన్ లో ఏ వస్తువు కొనుగోలు చేయాలన్నా.. దాదాపు అందరూ అమేజాన్, ఫ్లిప్ కార్ట్ వైపే చూస్తారనడంలో సందేహం లేదు. కాగా.. ఇప్పుడు ఈ రెండు ఒకరి చేతికిందకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.

గత కొంతకాలంగా ఫ్లిప్ కార్ట్ భారీ నష్టాల్లో నడుస్తోంది. దీంతో.. దానిని అమ్మేయాలనే ఆలోచనలో ఉంది. కాగా.. దీనిని క్యాష్ చేసుకోవడానికి అమేజాన్, వాల్ మార్ట్ లు ప్రయత్నిస్తున్నాయి. ఫ్లిప్ కార్ట్ ని చేజిక్కించుకునేందుకు ఈ రెండు సంస్థలు పోటీ పడుతున్నాయి. ఇప్పటికే తమ కొనుగోలు ప్రతిపాదనను ఫ్లిప్ కార్ట్ ముందు ఉంచాయి. అయితే.. రెండింటిలో దేని చేతికి ఫ్లిప్ కార్ట్ చేరుతుందనే విషయంపై ఇప్పటివరకు క్లారిటీ లేదు.

ఫ్లిప్‌కార్ట్‌లో 40 శాతం కంటే ఎక్కువ వాటాను కొనుగోలు చేయడానికి వాల్‌మార్ట్‌ సంప్రదింపులు జరుపుతోంది. దీని ద్వారా ఆసియాలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన అమెజాన్‌కు సవాలు విసరాలని భావిస్తోంది. 2007లో ఫ్లిప్‌కార్ట్‌ను అమెజాన్‌ మాజీ ఉద్యోగులైన సచిన్‌ బన్సాల్‌, బిన్నీ బన్సాల్‌ స్థాపించారు. భారత్‌లో దాదాపు 40 శాతం ఆన్‌లైన్‌ రీటైల్‌ వ్యాపారం  దీని పరిధిలో ఉంది.