ఐఫోన్ పై భారీ డిస్కౌంట్లు

First Published 1, Dec 2017, 3:16 PM IST
Amazon India launches iPhone fest offering iPhone SE at Rs 18990 and more
Highlights
  • ఐఫోన్ లపై భారీ డిస్కౌంట్లు ప్రకటించిన అమేజాన్
  • రూ.18వేలకు ఐఫోన్ ఎస్ఈ 

ప్రముఖ ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ సంస్థ యాపిల్ విడుదల చేసే ఐఫోన్ లకే విదేశాలతోపాటు భారత్ లో క్రేజ్ చాలా ఎక్కువ. యాపిల్ నుంచి కొత్త ఫోన్ విడుదల అవుతుందనగానే.. రెండు మూడు రోజుల ముందే ఫోన్ కోసం క్యూ కట్టేస్తారు. అలాంటి ఐఫోన్ ఇప్పుడు డిస్కౌంట్ ధరలో లభిస్తున్నాయి. అమేజాన్ లో ఇప్పుడు ఐఫోన్లు తక్కువ ధరకే లభిస్తున్నాయి.

అసలు విషయం ఏమిటంటే.. అమెజాన్ లో ఐఫోన్ ఫెస్ట్ పెట్టారు. ఇందులో భాగంగానే ఫెస్ట్‌లో భాగంగా ఐఫోన్‌ కొత్త మోడల్స్‌, పాత మోడల్స్‌పై భారీ డిస్కౌంట్లను ఆఫర్లను ప్రకటించింది. నవంబర్‌ 30 నుంచి ప్రారంభమైన ఈ ఫెస్ట్‌, డిసెంబర్‌ 9 వరకు ఈ ఫెస్ట్‌ జరుగనుంది.  కొన్ని ఐఫోన్లు ముఖ్యంగా ఐఫోన్‌ 7, ఐఫోన్‌ ఎస్‌ఈ లాంటి వాటిపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లను అమెజాన్‌ ప్రవేశపెట్టింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కార్డులపై ఈ ఐఫోన్లు కొనుగోలు చేసిన వారికి ప్రమోషనల్‌ ఆఫర్‌ కూడా అందుబాటులో ఉంచింది. అంతేకాక ఈ కాలంలోనే అమెజాన్‌ పాత ఐఫోన్‌ మోడల్స్‌ ఎక్స్చేంజ్‌పై రూ.9500 వరకు డిస్కౌంట్లను అందిస్తోంది. 

అమెజాన్‌లో ఐఫోన్‌ ఎస్‌ఈ 32జీబీ వేరియంట్‌ రూ.20,000కే లిస్టు అయింది. దీన్ని అమెజాన్‌ అసలు రూ.26వేలకు విక్రయిస్తోంది. అదనంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు మరో రూ.2000 డిస్కౌంట్‌ ఆఫర్‌ చేస్తుంది. దీంతో ఐఫోన్‌ ఎస్‌ఈ కస్టమర్లకు రూ.18వేలకే అందుబాటులోకి వచ్చింది. అదేవిధంగా ఐఫోన్‌ ఎస్‌ఈ 16జీబీ వేరియంట్‌ కూడా ఐఫోన్‌ ఫెస్ట్‌ సేల్‌ సందర్భంగా రూ.18,990కే లభ్యమవుతోంది. 

డిస్కౌంట్ తర్వాత ఐఫోన్ ధరలు ఇలా ఉన్నాయి..

ఐఫోన్‌ 7ను రూ.41వేలకు విక్రయిస్తోంది
ఐఫోన్‌ 6 ఎస్‌ను రూ.35వేలకు అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఐఫోన్‌ 6 ధర రూ.26వేలుగా ఉంది
ఐఫోన్‌ 8 ప్లస్‌ 64జీబీ వేరియంట్‌ను రూ.69,685కు అందుబాటులోకి తీసుకొచ్చింది
ఐఫోన్‌ 8 64జీబీ వేరియంట్‌ను రూ.58,999కే లభిస్తోంది. ఇంకెందుకు ఆలస్యం వెంటనే అమేజాన్లో లాగిన్ అయ్యి.. మీకు నచ్చిన ఐఫోన్ ని కొనుగోలు చేయండి.

loader