ప్రముఖ ఈ-కామర్స్ వెబ్ సైట్ అమేజాన్ ఆఫర్ మేళా ప్రకటించింది. ఈ న్యూఇయర్ లో తొలిసారిగా అమేజాన్.. గ్రేట్ ఇండియన్ సేల్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. స్మార్ట్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఫ్యాషన్ ఇలా అన్నింటిపైనా సేల్ పెట్టింది. ఈ సేల్ జనవరి 21వ తేదీ నుంచి జనవరి 24వ తేదీ వరకు కొనసాగనుంది. ప్రైమ్ మెంబర్స్ కి మాత్రం అదనపు బెనిఫిట్స్ లభించనున్నాయి. ఈ సేల్ జనవరి 21వ తేదీ అమలౌతుండగా .. ప్రైమ్ మెంబర్స్ కి  మాత్రం.. సేల్ మొదలవ్వడానికి 12గంటల ముందు నుంచే ఈ సేల్ వర్తిస్తుంది.  ఈ ఆఫర్లతోపాటు హెచ్‌డీఎఫ్‌సీ డెబిట్, క్రెడిట్ కార్డులపై పది శాతం అదనపు డిస్కౌంట్ ఉంటుంది. అంతేకాదు అమెజాన్ పే యూజర్స్ రూ.250 అంతకన్నా ఎక్కువ ధర కలిగిన ప్రోడక్ట్స్‌ ను కొనుగోలు చేస్తే.. ప్రతి కొనుగోలుకు పది శాతం బ్యాలెన్స్ బ్యాక్ (రూ.200 వరకు) ఇస్తున్నట్లు అమెజాన్ ప్రకటించింది. 

మొబైల్స్‌ పై 40 శాతం వరకు డిస్కౌంట్లు
లేటెస్ట్ సేల్‌లో భాగంగా మొబైల్ ఫోన్స్, యాక్సెసరీస్‌పై 40 శాతం వరకు డిస్కౌంట్లు ఇవ్వనున్నారు. 60కిపైగా అమెజాన్ ఎక్స్‌ క్లూజివ్ మోడల్స్ కూడా డిస్కౌంటు రేట్లకు అందుబాటులో ఉంటాయి. యాపిల్, ఆసుస్, బ్లాక్‌బెర్రీ, కూల్‌ప్యాడ్, ఇన్‌ఫోకస్, లెనోవో, ఎల్‌జీ, మోటో, వన్‌ప్లస్, సామ్‌సంగ్, వివో, షియోమీలాంటి టాప్ బ్రాండ్ మొబైల్స్‌ పై ఆఫర్లు ఉన్నాయి. 

టీవీలు, ల్యాప్‌టాప్స్, ఎలక్ట్రానిక్స్‌ పై ఆఫర్లు
ఇక టీవీలపై 40 శాతం, టాబ్లెట్లపై 40 శాతం, స్టోరేజ్ డివైస్‌లపై 50 శాతం, నెట్‌వర్కింగ్ డివైస్‌లపై 60 శాతం, కెమెరాలపై 25 శాతం, హెడ్‌ఫోన్స్, స్పీకర్స్‌ పై 60 శాతం, పీసీ, సంబంధిత యాక్సెసరీస్‌పై 40 శాతం, ప్రింటర్లపై 35 శాతం డిస్కౌంట్లు అందుబాటులో ఉంటాయి. కొత్త ల్యాప్‌టాప్‌లపై రూ. 20 వేల వరకు డిస్కౌంట్లు ఇవ్వనుంది అమెజాన్.