విజయవాడలో ఉత్సాహంగా ‘ అమరావతి మారథాన్’

First Published 7, Jan 2018, 10:34 AM IST
amaravati marathon success in vijayawada
Highlights
  • ఉత్సాహంగా సాగిన అమరావతి మారథాన్

విజయవాడలో ఆదివారం ఉదయం నిర్వహించిన అమరావతి మారథాన్‌లో వేలాది మంది ఔత్సాహికులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు,  కలెక్టర్ లక్ష్మీకాంతం, నగర మున్సిపల్ కమిషనర్, పోలీసు కమిషనర్ గౌతం సవాంగ్ ఈ పరుగును ప్రారంభించారు. హాఫ్ మారథాన్, 5కే రన్, 10కే రన్ విభాగాల్లో పరుగు నిర్వహించారు. ఇందిరాగాంధీ స్టేడియం నుంచి ఉండవల్లిలోని మంతెన ఆశ్రమం వరకు పరుగు సాగింది. నగరవాసుల్లో ఆనందం, ఆరోగ్యం పెంపొందించేందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మంత్రి ఉమా తెలిపారు. ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం సంతోషంగా ఉందని కలెక్టర్, కమిషనర్ తెలిపారు. అమరావతి మారథాన్‌లో సినీ తారలు గౌరి ముంజల్, శాన్వి శ్రీవాస్తవ పాల్గొని సందడి చేశారు. ఇక్కడి ప్రజల ఉత్సాహం చూస్తుంటే సంతోషంగా ఉందన్నారు.

loader