Asianet News TeluguAsianet News Telugu

గౌరీ లంకేష్ కి అన్నా పొలిట్కోవ్ స్కాయ అవార్డు.. ఎమిటా అవార్డు ప్రత్యేకత?

  • గౌరీ లంకేష్ కి అన్నా పొలిట్కోవ్ స్కాయ అవార్డు
  • అందుకున్న గౌరి సోదరి కవితా లంకేష్
  • ఈ అవార్డు  వరించిన తొలి భారతీయురాలు గౌరీ లంకేష్ కావడం విశేషం.
All You Need to Know About Gauri Lankeshs Anna Politkovskaya Award

సరిగ్గా నెల రోజుల క్రితం కన్నడ జర్నలిస్టు , యాక్టివిస్టు గౌరీ లంకేష్ దారుణ హత్యకు గురైన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది.  మరణానంతరం ఆమెను  అన్నా పోలిట్కోవ్ స్కాయ అవార్డు వరించింది. ఈ అవార్డును గౌరీ లంకేష్  సోదరి కవిత లంకేష్  గురువారం అందుకున్నారు. ఈ అవార్డు  వరించిన తొలి భారతీయురాలు గౌరీ లంకేష్ కావడం విశేషం.

అన్నా పోలిట్కోవ్ స్కాయ అవార్డు ప్రత్యేకత..

ప్రముఖ రష్యన్ రిపోర్టర్ అన్నా పోలిట్కోప్ స్కాయ గౌరవార్థం  ఈ అవార్డును అందజేస్తారు.  ప్రపంచ వ్యాప్తంగా మహిళలు ఎవరైతే సమాజం కోసం పోరాడి ప్రాణాలు కోల్పోతారో వారికి ఈ అవార్డు అందజేస్తారు. అదేవిధంగా గౌరీ లంకేష్ కి ఈ అవార్డును ప్రధానం చేశారు.

ఎవరీ అన్నా పొలిట్కోవ్ స్కాయ?

అన్నా పోలిట్కోవ్ స్కాయ.. ఓ ప్రముఖ రష్కన్ జర్నలిస్టు.  అన్నా..ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేసేవారు. 2006వ సంవత్సరం మాస్కోలో ఆమెను అతి దారుణంగా హత్య చేశారు.  అన్నా.. పుట్టి పెరిగింది న్యూయార్క్ లో. ఉన్నత కుటుంబంలో పుట్టిన అన్నా.. కేవలం డబ్బు మాత్రమే సంపాదించాలి అనుకొని ఉంటే.. ఇంకేదైనా మార్గం ఎంచుకునేవారేమో. కానీ.. ఆమె సమాజం కోసం ఏదైనా చేయాలనుకుంది. అందుకే జర్నలిజాన్ని తన వృత్తిగా ఎంచుకుంది.

1980లో మాస్కో స్టేట్ యూనివర్శిటీలో గ్రాడ్యూయేషన్ పూర్తి చేసిన అన్నా.. తర్వాత ఇజ్వెస్టియా అనే డైలీ వార్త పత్రికలో చేరారు. ఆ పత్రికలో జర్నలిస్టుగా తన ప్రస్తానాన్ని ప్రారంభించిన అన్నా.. తర్వాత మరో రెండు మూడు వార్తా పత్రికల్లోనూ పనిచేశారు.  ఎందులో పనిచేసినా ఆమె లక్ష్యం ప్రజల సమస్యలు తీర్చడం.  ఎక్కడెక్కడ ప్రజల సమస్యలు ఉన్నాయో తెలుసుకొని వాటిమీద కథనాలు రాయడం మొదలుపెట్టింది. అంతేకాదు ప్రభుత్వ  కార్యాలయాల్లో అవినీతిని కూడా తన కథనాలతో బయటపెట్టింది.

మొదటినుంచి అన్నాకి పరిశోధనాత్మక కథనాలు రాయడం ఆసక్తి. అలా ఆమె చేసిన పరిశోధనలతో  రష్యాలోని 70లక్షల శరణార్థుల బాధలను ప్రపంచానికి తెలిపింది. 1999లో రెండో చెచన్ యుద్ధం ప్రారంభమైనప్పుడు అవతలి వైపు నుంచి ఒక రిపోర్టర్ కూడా ఈ విషయం గురించి చెప్పకపోవడం అన్నాకు ఆశ్చర్యం కలిగించింది. దీంతో.. ఆవిడ ఒక యాక్టివిస్టుగా మారి యుద్ధం గురించి ప్రచారం చేయడం ప్రారంభించారు. రష్యా సైనిక చర్యను చెచెన్ తిప్పి కొడుతుందనే అనుమానం ఆమెకు రాలేదు. ఈ యుద్ధ సమయంలో ఆమె ప్రవర్తించిన తీరు ప్రశంసనీయం. ఈ యుద్ధంలో చాలా మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఈ యుద్ధం గురించి, రష్యన్ మిలిటరీ వ్యవస్థ గురించి ఆమె పలు రకాల కథనాలు, పుస్తకాలు రాశారు.

ఆమె రాస్తున్న కథనాలను ఆపాలని ఆమెకు బెదిరింపులు కూడా వచ్చాయి. ఒకానొక సమయంలో ఆమెను కిడ్నాప్ కూడా చేశారు. అత్యాచారం చేస్తామంటూ బెదిరించారు. అయినా ఆమె బెదరలేదు. వీటన్నింటిపై అన్నా.. 2004లో ఓ పుస్తకం కూడా రాసింది. 2006వ సంవత్సరం అక్టోబర్ 7వ తేదీన ఆమె రాసిన ఓ ఆర్టికల్ ని సెండ్ చేద్దామనుకునే సమయంలో.. ఆమెపై దాడి జరిగింది. మాస్కోలోని ఆమె ఇంటి లాబో లో ఆమెను దారుణంగా కాల్చి హత్య చేశారు. అప్పుడు ఆమె వయసు 48 మాత్రమే.

అప్పటి నుంచి ఎవరైతే జర్నలిస్టులు సామాజ సేవచేస్తూ ప్రాణాలు కోల్పోతారో వారికి ఆమె పేరు మీద అవార్డు ఇవ్వాలని  ఆర్ ఏడబ్య్లూ( రీచ్ ఆల్ వుమెన్ ఇన్ వార్) అనే సంస్థ నిర్ణయం తీసుకుంది.

Follow Us:
Download App:
  • android
  • ios