బంగారంపై భారీ ఆఫర్లు

నేడే అక్షయ తృతీయ. ఇప్పటికే మహిళలు అందరూ.. బంగారం దుకాణాల ముందు క్యూలు కట్టేసి ఉంటారు. అక్షయ తృతీయ రోజు కనీసం గ్రాము బంగారం కొన్నా.. ఆ ఇంటికి శుభం కలుగుతుందనేది నమ్మకం.దీంతో.. ఈ రోజున ఇదో ఒక చిన్న వస్తువు అయినా కొనాలని భావిస్తుంటారు. బంగారం ధర ఎంత ఉన్నా.. ఎంతోకొత్త కొనుగోలు చేస్తుంటారు. కష్టమర్ల ఈ నమ్మకాన్ని క్యాష్ చేసుకునేందుకు చూస్తున్నాయి. ఆభరణాలపై భారీ ఆఫర్లు ప్రకటించేస్తున్నాయి. మరి ఆ ఆఫర్లు ఏంటో చూసేద్దామా...

కల్యాణ్‌ జ్యువెల్లరీస్‌ ఏకంగా 25 లక్కీ కస్టమర్లకు మెర్సిడెస్‌ బెంజ్‌ కార్లను గెలుచుకునే ఆఫర్‌ను ప్రకటించింది. అదే విధంగా పసిడి నాణేలను ఆఫర్లుగా అందిస్తోంది. ప్రతీ రూ.5000 బంగారు అభరణాల కొనుగోలుపై ఒక లక్కీ కూపన్‌ గెలుచుకునే అవకాశాన్ని అందిస్తోంది. కాగా మలబార్‌ గోల్డ్‌ అండ్‌ డైమాండ్స్‌ ప్రత్యేకంగా 'అక్షయ తతీయ' ఆన్‌లైన్‌ ఆఫర్‌ను ప్రకటించింది. అదే విధంగా రూ.15,000 విలువ చేసే బంగారం ఆభరణాల కొనుగోలుపై 150 మిల్లీ గ్రాముల బంగారం నాణాన్ని ఉచితంగా అందించనున్నట్టు తెలిపింది. కనీస ఆర్డర్ రూ.15,000 ఉండాలి. తదుపరి కొనుగోలుపై ఈ కార్డును వాడుకోవచ్చు. ఆఫర్లు ఈ నెల 25 వరకు ఉంటాయి.


తనిష్క్‌ జువెల్లర్స్‌ బంగారం, డైమాండ్‌ జువెల్లర్స్‌ మేకింగ్‌ ఛార్జీలను 25 శాతం వరకు తగ్గించింది. ఈ నెల 18 వరకే ఈ అవకాశం. పాత బంగారాన్ని ఇచ్చి ఎటువంటి తరుగు లేకుండా 100 శాతం ఎక్చేంజ్ చేసుకోవచ్చు.


ఇక ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ సైతం రూ.19,999 విలువైన ఆభరణాలు కొంటే వజ్రాభరణాలపై 70 శాతం వరకు తగ్గింపును ఆఫర్ చేస్తోంది.పీసీ జువెల్లరీ సైతం గోల్డ్‌ చెయిన్లను అ‍త్యంత తక్కువ ధరలకు అందించనున్నట్టు పేర్కొంది. ఇక ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ సైతం రూ.19,999 విలువైన ఆభరణాలు కొంటే వజ్రాభరణాలపై 70 శాతం వరకు తగ్గింపును ఆఫర్ చేస్తోంది.