అక్షర్ పటేల్ కి జట్టులో స్థానం జడేజా స్థానంలో అక్షర్ పటేల్.

శ్రీలంకతో జరగనున్న మూడో టెస్టులో అక్ష‌ర్ ప‌టేల్ ఎంపికయ్యారు. కొలంబోలో జరిగిన రెండో టెస్టు సందర్భంగా ఐసీసీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు జడేజా పై ఐసీసీ నిషేధం విధించింది. దీంతో జ‌డేజా పైన ఒక టెస్టు మ్యాచ్ , 50 శాతం మ్యాచ్ ఫీజులో కోత పెట్ట‌డం జ‌రిగింది.


ఇప్పుడు జడేజా స్థానంలో యువ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అక్ష‌ర్ పటేల్ భారత జట్టులోకి వచ్చాడు. 12వ తేదీన మూడో టెస్టు ప్రారంభం కానుంది. అతని స్థానంలో అక్సర్ పటేల్ ను సెలెక్టర్లు ఎంపిక చేశారు. ఈ విషయాన్ని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. నేడు అక్ష‌ర్ ప‌టేల్ శ్రీలంక‌కు బ‌య‌లుదేర‌నున్నారు. అక్ష‌ర్ ప‌టెల్ గురువారం ప్రాక్టీస్ పాల్గోంటారు. మూడ‌వ టెస్టు పల్లెకెలేలో జరగనుంది. ఇప్ప‌టికే రెండు టెస్టుల్లో ఇండియా విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే.