క్రికెటర్ రహానే తండ్రి అరెస్టు

Ajinkya Rahanes father arrested after his car ran over a woman in Kolhapur
Highlights

  • మహిళను కారుతో ఢీకొట్టిన రహానే తండ్రి

టీం ఇండియా క్రికెటర్ అజింక్య రహానే తండ్రి మధుకర్ బాబురావు రహానేను పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం ఉదయం మధుకర్.. ప్రమాదవశాత్తు ఓ మహిళను కారుతో గుద్దారు. దీంతో ఆ మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు మధుకర్ ని అదుపులోకి తీసుకున్నారు.

దేశరాజధాని ఢిల్లీలో శుక్రవారం ఉదయం మధుకర్ తన కుటుంబసభ్యులతో కలిసి హ్యుండాయ్ కారులో వెళ్తుండగా..కారు అదుపుతప్పి అటుగా వెళ్తున్న  ఓ మహిళను ఢీకొట్టారు. మృతిచెందిన మహిళ కంబల్ గా గుర్తించారు.  ఐపీఎసీ 304ఏ, 337, 338, 279, 184 ప్రకారం మధుకర్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


 

loader