వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రముఖ టెలికాం ఆపరేటర్ ఎయిర్‌టెల్ తన వినియోగదారుల కోసం ప్రత్యేక ఆఫర్లను తీసుకొచ్చింది. జియోతో పోటీపడేందుకు ఎయిర్ టెల్ ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తోంది. జియో ఆఫర్ ప్రకటించిన ప్రతిసారీ ఎయిర్ టెల్.. దానికి  పోటీగా మరో ఆఫర్ తీసుకువస్తూనే ఉంది. తాజాగా.. ప్లాన్ అప్ గ్రేడ్ చేసింది. రిపబ్లిక్ డే వేడుకలో భాగంగా జియో రూ.98 ప్యాక్‌ను తీసుకొస్తే... దానికి పోటీగా ఎయిర్‌టెల్‌ తన రూ.93 రీఛార్జ్‌ ప్లాన్‌ను అప్‌డేట్‌ చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 10 రోజులు మాత్రమే ఉండగా.. ఇప్పుడు దానిని నెల రోజులకు మార్చింది.

ఎయిర్‌టెల్‌ ప్రస్తుతం అప్‌డేట్‌ చేసిన ఈ ప్యాక్‌పై అపరిమిత లోకల్‌, ఎస్టీడీ కాల్స్‌ ను, రోమింగ్‌పై ఉచిత కాల్స్‌ ను, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లను, 1జీబీ (4జీ లేదా 3జీ స్పీడుతో) డేటాను 28 రోజుల పాటు అందించనున్నట్టు పేర్కొంది.. జియో అందిస్తున్న ప్రయోజనాలకు సమానంగా తన కస్టమర్లకు అందించడానికి ఎయిర్‌టెల్‌ ఈ రూ.93 ప్యాక్‌ను అప్‌డేట్‌ చేసినట్టు తెలిసింది. జియో సైతం తన రూ.98 రీఛార్జ్‌ ప్యాక్‌పై అందించే డేటాను 1జీబీ నుంచి 2జీబీకి పెంచింది.