ఆఫర్ల వర్షం కురిపిస్తోన్న ఎయిర్ టెల్

First Published 2, Jan 2018, 11:05 AM IST
Airtel Takes on Jio With Updated Rs 799 Pack That Offers 35GB Data per Day
Highlights
  • జియోకి గట్టి పోటీ ఇస్తున్న ఎయిర్ టెల్
  •  మరో ఆఫర్ ని ప్రకటించిన ఎయిర్ టెల్
  • రోజుకి 3.5జీబీ డేటా

ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్ టెల్ ఆఫర్ల వర్షం కురిపిస్తోంది. ఇటీవలే కొన్ని ఆఫర్లు ప్రకటించిన ఎయిర్ టెల్.. తాజాగా న్యూ ఇయర్ లో మరో ఆఫర్ కి తెరలేపింది. తన రూ.799 ప్రీపెయిడ్‌ ప్లాన్‌ను అప్‌డేట్‌ చేస్తున్నట్టు పేర్కొంది. ఈ ప్లాన్‌ కింద 28 రోజుల పాటు 98జీబీ 3జీ/4జీ డేటా ఆఫర్ చేయనున్నట్టు తెలిసింది. అంటే రోజుకు 3.5జీబీ డేటాను అందించనుంది. ఈ ఆఫర్‌లోనే  లోకల్‌, ఎస్టీడీ కాల్స్‌, రోమింగ్‌ వాయిస్‌ కాల్స్‌, 100 లోకల్‌, నేషనల్‌ ఎస్‌ఎంఎస్‌లను 28 రోజుల పాటు అందించనున్నట్టు పేర్కొంది.అంతకముందు రూ.799 ప్యాక్‌ కింద ఎయిర్‌టెల్‌ 28 రోజులకు 84 జీబీ డేటానే ఆఫర్‌ చేసేది. ప్రస్తుతం 3జీబీ పరిమితిని 3.5జీబీకి పెంచేసింది. ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంకు ద్వారా ఈ ప్యాక్‌ను రీఛార్జ్‌ చేసుకున్న కస్టమర్లకు రూ.75 క్యాష్‌బ్యాక్‌ రానుంది. వాయిస్‌ కాలింగ్‌ పరిమితి రోజుకు 250 నిమిషాలు ఉంది. వారానికి 1000 నిమిషాలుగా ఉంది. 

మరో వైపు రిలయన్స్‌ జియో కూడా రూ.799ప్యాక్‌ను అందిస్తోంది. జియో అందించే ప్యాక్‌ కింద రోజుకు 3జీబీ లభ్యమవుతోంది. అంటే ఎయిర్‌టెల్‌, జియో కంటే 14జీబీ డేటాను అత్యధికంగా ఆఫర్‌ చేస్తోంది. ఈ లెక్కన ఎయిర్ టెల్.. జియోకి గట్టి పోటీనే ఇస్తోంది.

loader