జియోకు ధీటుగా ఎయిర్‌టెల్ స్మార్ట్‌ఫోన్‌

Airtel start to launch new phone
Highlights

  • భార‌తీ ఎయిర్‌టెల్  జియో మోబైల్ ఫోన్‌కు ధీటుగా ఫోన్ తయారికి ప్రయత్నం.
  • ఎయిర్ టెల్ ఫోన్ లో అన్ని ఫీచర్లు సదుపాయం.
  • జియో ఫోన్ ను తలదన్నేలా  ఎయిర్ టెల్ ఫోన్ తయారి.
  • దసరా, దీపావళి కి మార్కెట్ ను తాకనున్న ఎయిర్ టెల్ ఫోన్లు.

రిలయన్స్ జియో టెలికాం మార్కెట్‌లోకి తెచ్చిన సునామీ నుండి బ‌య‌ట ప‌డ‌టానికి ఇత‌ర టెలికాం సంస్థ‌లు తీవ్రంగా ప్ర‌య‌త్నాలు ప్రారంభిస్తున్నాయి. ఇప్ప‌టికే టెలికాం ఇండస్ట్రీలో జియోతో పోటికి ద‌రిదాపుల్లో కూడా ఏ సంస్థ లేకుండా పోయింది. ఇప్ప‌టికే జియో ఉచిత ఫీచర్ ఫోన్ ప్ర‌క‌ట‌న తో మిగ‌తా టెలికాం కంపేనీలు మార్కెట్‌లో మ‌రింత వెనుక‌బాటు త‌ప్ప‌ద‌ని భావించాయి.

ఇత‌ర టెలికాం కంపెనీల నుండి జియోకు భారీగా యూజ‌ర్లు త‌ర‌లిపోయారు, ఇప్పుడు జియో త‌క్కువ రేటుకే మోబైల్ కూడా తీసుకురావ‌డంతో మ‌రింత మంది యూజ‌ర్లు కోల్పోవాల్సి ఉంటుంది, జియో ఫోన్ లో ఇత‌ర టెలికాం కంపెనీల సిమ్‌ల‌కు అవ‌కాశం లేదు, దీనికి తోడు జియో త‌క్కువ రేట్ల‌కే నెల‌కు అన్‌లిమిటెడ్‌ కాల్స్‌, రోజుకు 1జీబీ డెటా ఇస్తుండ‌టంతో జియోతో మ‌రింత‌ ముప్పు త‌ప్ప‌ద‌ని ఇత‌ర సంస్థ‌ల‌తో పాటు ఎయిర్‌టెల్ కూడా భావించింది.

జియోతో పోటీకి ఎయిర్‌టెల్ ఇప్ప‌టికే ప‌లు ప్ర‌య‌త్నాలు చేసిన విష‌యం తెలిసిందే, అయితే భార‌తీ ఎయిర్‌టెల్ తాజాగా జియో మోబైల్ ఫోన్‌కు ధీటుగా నూత‌న ఫీచ‌ర్లున్న ఫోన్ ను ప్ర‌వేశ‌పెట్టాల‌ని చూస్తుంది. దీని కోసం మొబైల్ ఫోన్ తయారీ కంపెనీలతో ఎయిర్ టెల్ జరుపుతున్న చర్చలు తుది దశకు చేరుకున్నట్టు సమాచారం. అధిక మొత్తంలో డేటాతో పాటు వాయిస్ మినిట్స్ ఇస్తూ, ఈ ఫోన్ ను ఫీచర్ ఫోన్ తో పోలిస్తే మెరుగైన ఆప్షన్లతో తీసుకువస్తున్నట్టు ఎయిర్ టెల్ వర్గాలు వెల్లడించాయి. 

Image result for jio phone

ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ తో పాటు అన్ని రకాల యాప్స్ నూ వాడుకోదగ్గ ఎయిర్‌టెల్ ఫోన్‌ను త‌యారు చేస్తుంది. అందుకు ఎయిర్ టెల్ తమతో చర్చలు జరిపిన మాట వాస్తవమేనని ఇండియ‌న్ మోబైల్ కంపెనీలు అయినా లావా, కార్బన్ సంస్థలు ప్రకటించాయి. ఎయిర్‌టెల్ త‌న నూత‌న ఫోన్‌ను దసరా, దీపావళి పండగ సీజన్ లో మార్కెట్లోకి రావచ్చని తెలుస్తోంది. జియో ఫీచర్ ఫోన్ తో పోలిస్తే మెరుగైన స్క్రీన్, మంచి కెమెరా, అధిక బ్యాటరీ సామర్థ్యం దీనికి ఉంటాయని టెలికం ఇండస్ట్రీ నిపుణులు తెలుపుతున్నారు.  

Related image
మరిన్ని తాజా విశేషాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

loader