రూ.149 ప్లాన్‌తో 28 జీబీ డేటా

ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్ టెల్ ప్రీపెయిడ్ కష్టమర్ల కోసం మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇప్పటికే జియో పోటీని తట్టుకునేందుకు వివిధ ఆఫర్లు ప్రకటించిన ఎయిర్ టెల్.. ఇప్పుడు మరో ఆఫర్ ని తీసుకువచ్చింది.

రూ.149కే 28 జీబీ డేటాను అందిస్తున్నది. ఈ ప్లాన్‌ను రీచార్జి చేసుకుంటే వినియోగదారులకు అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఉచిత ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి. అలాగే రోజుకు 1జీబీ డేటా చొప్పున మొత్తం 28 రోజుల వాలిడిటీకి గాను 28 జీబీ డేటా లభిస్తుంది. 

గతంలో ఈ ప్లాన్‌కు 28 రోజులకు 1 జీబీ డేటా లభించేది. కానీ దీనికి ఎయిర్‌టెల్ మార్పు చేసింది. అయితే ఇదే ప్లాన్ ద్వారా జియోలో రోజుకు 1.5 జీబీ డేటా లభిస్తుంది.