ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్ టెల్.. మరో సరికొత్త ఆఫర్ ని వినియోగదారుల ముందుకు తీసుకువచ్చింది. రూ.9కే ప్రీపెయిడ్ ప్లాన్ ని పరిచయం చేసింది. ఇటీవల జియో.. రూ.19కే ప్రీపెయిడ్  ప్లాన్ ని తీసుకురాగా.. దానికి పోటీగా ఎయిర్ టెల్ ఈ ప్లాన్ తీసుకువచ్చింది.

రిలయన్స్ జియోలో 19 రూపాయలు పెట్టి రీఛార్జ్ చేసుకుంటే.. 150 ఎంబీ మొబైల్ డేటా , 20 ఎస్ఎంఎస్ లతో పాటు అన్లిమిటెడ్ ఫోన్ కాల్స్ లభిస్తాయి. అదే ఎయిర్ టెల్ తాజాగా ప్రవేశపెట్టిన ప్లాన్‌లో 100 ఎస్ఎంఎస్ లు, అపరిమితమైన ఫోన్ కాల్స్, 100 ఎంబీ మొబైల్ డేటా లభిస్తుంది. మొబైల్ డేటా పరంగా ఎయిర్ టెల్ కన్నా జియో నే మెరుగ్గా కనిపిస్తున్నా ఎక్కువ ఎస్ఎంఎస్ లు కోరుకునేవారికి ఎయిర్ టెల్ 9 రూపాయల ప్లాన్ అనువుగా ఉంటుంది. అంతేకాదు, ఇది జియో కన్నా 10 రూపాయలు తక్కువకే లభించడం గమనార్హం. కేవలం ఒక్క రోజు వ్యాలిడిటీతో ఈ ప్లాన్ పనిచేస్తుంది.