జియో పోటీని తట్టుకునేందుకు ఎయిర్ టెల్ చేయని ప్రయత్నం లేదు. ఇప్పటికే జియోకి పోటీగా పలు ఆఫర్లను ప్రవేశపెట్టిన ఎయిర్ టెల్.. తాజాగా మరో ప్రీపెయిడ్ ప్లాన్ తీసుకువచ్చింది.ఇక నుంచి ఎయిర్ టెల్ కష్టమర్లకు రోజుకి  2జీబీ మొబైల్ డేటా అందించనున్నట్లు చెప్పింది. 499 రూపాయలు పెట్టి రీచార్జ్  చేసుకుంటే చాలు.. 84 రోజుల పాటు ప్రతిరోజు 2జీబీ చొప్పున లభిస్తుంది. అంతేకాదు, ఈ 84 రోజులపాటు ఉచిత ఫోన్ కాల్స్, రోజుకి 100 ఎస్ఎంఎస్లు కూడా అందించబడతాయి. కేవలం లోకల్, ఎస్టీడీ ఫోన్ కాల్స్ మాత్రమే కాదు, రోమింగ్ కాల్స్ కూడా లభిస్తాయి.

వాస్తవానికి ఈ ప్లాన్ చాలా ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ.. ఎయిర్ టెల్ అతి కొద్దిమందికి మాత్రమే ఈ ప్లాన్ అందిస్తోంది. దీనికి మీకు అర్హత ఉందో లేదో తెలియాలంటే మీ ఫోన్లో మై ఎయిర్ టెల్ యాప్ ని ఓపెన్ చేసి దాంట్లో ఈ ప్లాన్ వివరాలు కన్పిస్తున్నాయో లేదో గమనించండి. ఒకవేళ ఈ ప్లాన్ వివరాలు మీకు కనిపించినట్లయితే 84 రోజులకి గాను 164 జీబీ మొబైల్ డేటా లభిస్తుంది.