మరో ఆఫర్ తో షాకిచ్చిన ఎయిర్ టెల్

First Published 23, Jan 2018, 11:12 AM IST
Airtel Rs 399 plan now offers 1GB data per day for 84 days to counter Reliance Jio
Highlights
  • ఎయిర్ టెల్ మరో బంపర్ ఆఫర్
  • టారిఫ్ లను మరోసారి అప్ గ్రేడ్  చేసిన ఎయిర్ టెల్

ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్ టెల్ మరో ఆఫర్ ని ప్రవేశపెట్టింది. జియోకి గట్టి పోటీ ఇచ్చేందుకు టారిఫ్ లను అప్ గ్రేడ్ చేసింది. రూ.399తో రీఛార్జ్‌ చేయడం ద్వారా 28 రోజుల పాటు, రోజుకు 1జీబీ డేటా, అపరిమిత లోకల్‌, ఎస్‌టీడీ, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లను అందిస్తోంది. జనవరి మొదటి వారంలో ఈ ప్యాక్‌ను 70 రోజులకు అప్‌గ్రేడ్‌ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ప్యాక్‌ను 84 రోజులకు అప్‌గ్రేడ్‌ చేస్తున్నట్లు తెలిపింది.

జియో రూ.398 ప్యాక్‌నకు పోటీగా దీనిని తీసుకొచ్చింది. అయితే జియో ఈ టారిఫ్‌ కింద 70 రోజుల కాలపరిమితిని విధించగా, రోజుకు 1.5జీబీ హైస్పీడ్‌ 4జీ డేటా ఇస్తుండటం గమనార్హం.అదే విధంగా రూ.149 ప్యాక్‌ కింద ఇస్తున్న ఆఫర్లను ఎయిర్‌టెల్‌ సవరించింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లోని వినియోగదారులు రూ.149తో రీఛార్జ్‌ చేసుకోవడం ద్వారా 28 రోజుల పాటు రోజుకు 1జీబీ డేటా, అపరిమిత వాయిస్‌కాల్స్‌ రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు ఉచితంగా పొందవచ్చు.

 

loader