ఎయిర్ టెల్ మరో బంపర్ ఆఫర్

First Published 19, Dec 2017, 4:05 PM IST
Airtel prepaid recharge offer of Rs 49 gives 1GB data for a day
Highlights
  • రూ.49కే 1జీబీ డేటా

వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఎయిర్ టెల్ మరో బంపర్ ఆఫర్ ని ప్రకటించింది. కేవలం రూ.49కే 1జీబీ డేటా అందిస్తోంది. కాకాపోతే దీని వ్యాలిడిటీ ఒక్కరోజు మాత్రమే. అంతేకాకుండా ఈ ఆఫర్ లో అన్ లిమిటెడ్ కాల్స్, ఎస్ఎంఎస్ లు ఉండవు. కేవలం 3జీ/4జీ మొబైల్ డేటా మాత్రం వస్తుంది. ఇది మాత్రమే కాకుండా మరో ఆఫర్ ని కూడా ఎయిర్ టెల్ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువచ్చింది.

రూ.59తో రీఛార్జ్ చేసుకుంటే.. రోజుకి 500ఎంబీ డేటా చొప్పున.. వారం రోజులపాటు డేటాని వినియోగించుకోవచ్చు. ఈ ఆఫర్ లో అన్ లిమిటెడ్ లోకల్, ఎస్టీడీ కాల్స్ చేసుకునే సదుపాయం కలదు. అదేవిధంగా రోజుకి 100 ఎస్ఎంఎస్ లు కూడా చేసుకోవచ్చు. రూ.98తో రీఛార్జ్ చేసుకుంటే 1జీబీ డేటా 28రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. రూ.99తో రీఛార్జ్ చేసుకుంటే 2జీబీ డేటా 5రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. సేమ్ ఇలాంటి ఆఫర్లనే జియో, వొడాఫోన్ కూడా అందిస్తోంది. వాటినుంచి వస్తున్న పోటీని తట్టుకునేందుకే ఎయిర్ టెల్ ఈ ఆఫర్లను ప్రవేశపెట్టింది.

loader