రిలయన్స్ జియో.. టెలికాం రంగంలోకి అడుగుపెట్టిన నాటి నుంచి ఈ రంగంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. జియో ప్రకటిస్తున్న ఆఫర్లకి.. అన్ని టెలికాం సంస్థలు విలవిలలాడిపోయాయి. ఎయిర్ టెల్ అయితే.. ఏకంగా జియో ప్రవేశపెట్టిన ప్రతి ఆఫర్ కి పోటీగా మరో ఆఫర్ తీసుకువస్తూ వచ్చింది. అయితే.. తాజాగా.. జియోకి దిమ్మతిరిగే ఆఫర్ ని ఎయిర్ టెల్ తీసుకువచ్చింది. కేవలం రూ.1 అద్భుతమైన ఆఫర్ తీసుకువచ్చింది.

కేవలం ఒక్క రూపాయితో అన్ లిమిటెడ్ డేటా, కాల్స్ , ఎస్ఎంఎస్ లను పొందవచ్చు. ఇంతకీ ఈ రూ.1 ఆఫర్ ని ఎలా వినియోగించాలో తెలుసా..? ఏమీ లేదండి.. ప్రస్తుతం మీరు ఎయిర్ టెల్ ఏదో ఒక ఆఫర్ ని వాడుతూ ఉండే ఉంటారు. కొన్ని సార్లు.. మన ఫోన్లో మొబైల్ డేటా, అన్ లిమిటెడ్ కాల్స్ ఉన్నప్పటికీ.. ప్లాన్ మాత్రం ఎక్స్ పైర్ అయిపోతూ ఉంటాయి. ఒక్కోసారి డేటా, కాల్స్ యూస్ చేసుకున్నాక కూడా ఎక్స్ పైర్ అయిపోవచ్చు. మళ్లీ తిరిగి ఆఫర్ పొందాలంటే.. మళ్లీ రీఛార్జ్ చేసుకోవాలి.  అయితే.. ఇప్పుడు ఆ అవసరం లేదు. మీరు తీసుకున్న ప్లాన్ మరో రోజులో ఎక్స్ పైర్ అయిపోతుంది అనుకున్న సమయంలో రూ.1తో రీఛార్జ్ చేసుకుంటే.. చాలు మరికొద్ది రోజుల పాటు డేటా, అన్ లిమిటెడ్ కాల్స్ పొందవచ్చు.

 అయితే.. ఈ రూ.1 ప్లాన్.. రూ.93, రూ.149 ప్లాన్లకు మాత్రమే వర్తిస్తుందని సమాచారం. దీని గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అంతేకాకుండా ఇది మరికొద్ది రోజుల్లో వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.