ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్ టెల్, మొబైల్ ఫోన్ తయారీ సంస్థ సామ్ సంగ్  జతకట్టాయి. సామ్ సంగ్ గెలాక్సీ జె సిరీస్ మోడల్ ఫోన్ వినియోగదారులకు క్యాష్ బ్యాక్ ఆఫర్ ఇవ్వనున్నట్లు ఎయిర్ టెల్ ప్రకటించింది. గెలాక్సీ జే2 (2017), గెలాక్సీ జే5 ప్రైమ్‌, గెలాక్సీ జే7 ప్రైమ్‌, గెలాక్సీ జే7 ప్రో మోడళ్లపై ఎయిర్‌టెల్‌ ఆఫర్లు ప్రకటించింది. ఈ ఫోన్ల వినియోగదారులు ఎయిర్ టెల్ సిమ్ ని కనుక ఉపయోగిస్తే.. వారికి ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్ వర్తిస్తుంది. జనవరి 7వ తేదీ నుంచి ఈ ఆఫర్ అమలులోకి రానుంది.

సామ్ సంగ్ స్మార్ట్ ఫోన్ వినియోగదారులు రూ.199తో ప్రత్యేక రీఛార్జి చేసుకుంటే.. దేశవ్యాప్తంగా అపరిమిత కాల్స్‌, రోజుకు 1 జీబీ డేటా పొందుతారు. 24 నెలల్లో ఎయిర్‌టెల్‌ ఖాతాదారులు రూ.5,000తో రీఛార్జి చేసుకోవాల్సి ఉంటుంది. అలా చేసుకుంటే వారికి రూ.1500 క్యాష్ బ్యాక్ అందజేస్తామని తెలిపింది. క్యాష్ బ్యాక్ మనీని వినియోగదారుల బ్యాంక్ ఖాతాలో జమచేస్తామని చెప్పింది. ఇలాంటి ఆఫర్ నే వొడాఫోన్ కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. సామ్ సంగ్ స్మార్ట్ ఫోన్ వినియోగదారులు.. వొడాఫోన్ సిమ్ కనుక ఉపయోగిస్తే వారికి ఈ ఆఫర్ వర్తిస్తుంది. రెండు సంవత్సరాల పాటు రూ.198తో రీఛార్జ్ చేసుకుంటే వారికి రెండు విడతల్లో రూ.1500 క్యాష్ బ్యాక్ ఆఫర్ అందజేస్తామని తెలిపింది.