టెలికాం రంగంలో ‘జియో’ ఒక సంచలనం. వినియోగదారులను ఆకట్టుకునేందుకు జియో ఇప్పటికే చాలా ఆఫర్లు తీసుకవచ్చింది. కాగా.. జియోకి షాకిచ్చేలా ఎయిర్ టెల్ కొత్త ఆఫర్ ని ప్రకటించింది. ప్రీపెయిడ్ వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది.  ప్రీపెయిడ్‌ కస్టమర్లకు రూ. 199కే రోజుకు 1జీబీ డేటా అందించనున్నట్లు ప్రకటించింది.

రూ. 199తో రీఛార్జ్‌ చేసుకుంటే 28 రోజుల పాటు రోజుకు 1జీబీ 3జీ/4జీ డేటాతో పాటు అపరిమిత లోకల్‌, ఎస్‌టీడీ కాల్స్‌, అపరిమిత ఎస్‌ఎంఎస్‌ సేవలను అందించనున్నట్లు ఎయిర్‌టెల్‌ తెలిపింది. ప్రస్తుతం ఉన్న కస్టమర్లతో పాటు.. కొత్తగా చేరే వినియోగదారులకు కూడా ఈ ఆఫర్‌ వర్తిస్తుందని పేర్కొంది. అయితే ప్రస్తుతం చెన్నై, దిల్లీ-ఎన్‌సీఆర్‌, ముంబయి, కర్ణాటక తదితర ఎంపిక చేసిన ప్రాంతాల్లోని కస్టమర్లకు మాత్రమే ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంది.  త్వరలోనే దేశ వ్యాప్తంగా ఈ సేవలను అందించనున్నారు. కాగా.. ఇప్పటికే వొడాఫోన్‌ కూడా ఇలాంటి ఆఫర్‌నే ప్రకటించిన విషయం తెలిసిందే.