ఇప్పటివరకు ఎయిర్ టెల్ ప్రీపెయిడ్ కష్టమర్లకు ఆఫర్లు ప్రకటిస్తూ వచ్చింది. కాగా.. తాజాగా పోస్ట్ పెయిడ్ కష్టమర్లకు కూడా ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. తమ పోస్ట్ పెయిడ్, వీ ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ కష్టమర్లకు ఉచితంగా అమేజాన్ ప్రైమ్ సర్వీసుల సబ్ స్రిప్షన్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అయితే.. ఇందుకోసం కష్టమర్లు తమ స్మార్ట్ ఫోన్ లో ఎయిర్ టెల్ టీవీ యాప్ ని డౌన్ లోడ్ చేసుకుంటే సరిపోతుంది.

అమెజాన్ ప్రైమ్ వీడియోస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. లేటస్ట్ సినిమాలు, ప్రోగ్రామ్ లను ఇందులో వీక్షించవచ్చు. ఇప్పటివరకు నెలకు రూ.499 చెల్లించి ప్రైమ్ నెంబర్ తీసుకున్నవాళ్లు మాత్రమే ఆ వీడియోస్ చూసేందుకు అవకాశం ఉండేది. కాగా.. ఇప్పుడు ఆ డబ్బులు చెల్లించకుండానే వీడియోస్ చూసే అవకాశం కల్పిస్తోంది ఎయిర్ టెల్. ఎయిర్‌టెల్ పోస్ట్‌ పెయిడ్‌లో 499, ఆపైన మైఇన్ఫినిటీ ప్లాన్స్..అటు వీ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్‌లో వెయ్యికిపైగా ప్లాన్స్ ఉన్నవాళ్లకు మాత్రమే ఈ ఫ్రీ సబ్‌స్క్రిప్షన్ ఆఫర్ వర్తిస్తుంది. అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌తో ఫ్రీ డెలివరీ, ప్రైమ్ వీడియో స్ట్రీమింగ్, అమెజాన్‌లో డీల్స్‌ కు మిగతా కస్టమర్ల కంటే ముందుగా యాక్సెస్ ఇస్తారన్న విషయం తెలిసిందే. 

ప్రైమ్ మెంబర్‌షిప్ లేని అమెజాన్ యూజర్లకే ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఇప్పటికే ఉన్నవాళ్లు దాని కాల పరిమితి అయిపోయిన తర్వాత ఈ ఆఫర్‌కు మారవచ్చు. ప్లేస్టోర్ నుంచి ఎయిర్‌టెల్ టీవీని డౌన్‌లోడ్ చేసుకొని రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌తో లాగిన్ కావాలి. ఆ తర్వాత అమెజాన్ ప్రైమ్ ఐకాన్‌పై క్లిక్ చేయాలి. మరో డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. అక్కడ యాక్టివ్ నౌ బటన్ ప్రెస్ చేయాలి. ఆ తర్వాత మీ అమెజాన్ అకౌంట్ వివరాలు ఎంటర్ చేయాలి. మీ వివరాలు వెరిఫై అయిన తర్వాత మీ 365 రోజుల ఫ్రీ సబ్‌స్క్రిప్షన్ మొదలైనట్లే. ఆఫర్ వర్తించాలంటే ఎయిర్‌టెల్ చెప్పినట్లు రూ.499 ప్లాన్‌లోనో లేదా అంతకన్నా పెద్ద ప్లాన్‌కు అప్‌గ్రేడ్ అయితేనే ఫ్రీ సబ్‌స్క్రిప్షన్ కొనసాగుతుంది. ఆ ప్లాన్ కన్నా తక్కువ ప్లాన్‌కు మారితే.. సబ్‌స్క్రిప్షన్ ఆటోమెటిగ్గా రద్దవుతుంది.