మరో సరికొత్త ప్లాన్ ప్రవేశపెట్టిన ఎయిర్ టెల్

Airtel introduces Rs 65 prepaid recharge plan offering 1GB 3G data for for 28 days
Highlights

అతితక్కువ ధరకే ఎయిర్ టెల్ నయా ప్లాన్

ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్ టెల్.. వినియోగదారుల కోసం సరికొత్త ప్లాన్ ని ప్రవేశపెట్టింది. రూ.65కే ఓ ప్లాన్ ని  ప్రవేశపెట్టింది. ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ కస్టమర్లు రూ.65తో రీచార్జి చేసుకుంటే వారికి 1జీబీ 3జీ/2జీ మొబైల్ డేటా ఉచితంగా లభిస్తుంది. దీనికి 28 రోజుల వాలిడిటీ ఉంటుంది. అయితే ఈ ప్లాన్‌ను మై ఎయిర్‌టెల్ యాప్ ద్వారా రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. పలువురు ఎంపిక చేసిన కస్టమర్లకు మాత్రమే ఈ ప్లాన్ అందుబాటులో ఉంది. ప్రత్యేక ఆఫర్ కింద ఈ ప్లాన్ లభిస్తుంది. ఈ ప్లాన్‌లో లభించే మొబైల్ డేటాకు గాను ఇంటర్నెట్ స్పీడ్ కేవలం 3జీ లేదా 2జీ మాత్రమే వస్తుంది. 4జీ స్పీడ్ లభించదు.

loader