ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న స్మార్ట్ ఫోన్లు అన్నింటికన్నా.. తక్కువ ధరలో స్మార్ట్ ఫోన్లు రానున్నాయి. వీటిని ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ , టెలికాం కంపెనీ ఎయిర్ టెల్ అందించనున్నాయి. ఈ మేరకు గూగుల్‌.. ఎయిర్‌టెల్‌ లు  భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నాయి. ‘మేరా పెహలా స్మార్ట్‌ ఫోన్‌’ లో భాగంగా ఆండ్రాయిడ్‌ ఓరియో వెర్షన్‌తో పనిచేసే బేసిక్‌ 4జీ స్మార్ట్‌ ఫోన్లను మార్చి నుంచి అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఇందులో భాగంగా దేశీయ మొబైల్‌ కంపెనీలైన లావా, మైక్రోమ్యాక్స్‌ తొలి సెట్‌ స్మార్ట్‌ఫోన్లను విడుదల చేయబోతున్నాయి.

ఈ ఫోన్లలో ఎయిర్‌టెల్‌కు చెందిన మై ఎయిర్‌ టెల్‌ , ఎయిర్‌టెల్‌ టీవీ, వింక్‌ మ్యూజిక్‌ వంటి అప్లికేషన్లు ప్రీలోడెడ్‌గా లభిస్తాయి. 1జీబీ ర్యామ్‌ అంతకంటే తక్కువ సామర్థ్యంతో రూపొందించిన స్మార్ట్‌ ఫోన్ల కోసం ఆండ్రాయిడ్‌ ఓరియో(గో ఎడిషన్‌)ను ప్రత్యేకంగా రూపొందించారు. వచ్చే నెల మార్చి నుంచి ఈ ఫోన్లు మార్కెట్లోకి రానున్నాయి. ధర కూడా రూ.2వేల లోపే ఉండొచ్చని సమాచారం