ఎయిర్ టెల్ బంపర్ ఆఫర్..30జీబీ డేటా ఉచితం

ఎయిర్ టెల్ బంపర్ ఆఫర్..30జీబీ డేటా ఉచితం

 ఎయిర్‌టెల్ తమ కస్టమర్లకు ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. మేరా పెహలా స్మార్ట్‌ఫోన్ ఆఫర్‌ను శుక్రవారం లాంచ్ చేసింది. ఇందులో భాగంగా 2జీ లేదా 3జీ ఫోన్లు వాడుతున్న ఎయిర్‌టెల్ కస్టమర్లు 4జీ స్మార్ట్‌ఫోన్‌కు కనుక మారితే  30 జీబీ డేటాను ఉచితంగా ఇవ్వనుంది. ఈ ఆఫర్ ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ కస్టమర్లకు వర్తిస్తుంది. ప్రీపెయిడ్ కస్టమర్లయితే రోజూ ఒక జీబీ చొప్పున 30 రోజులకు 30 జీబీ ఇవ్వనుండగా.. పోస్ట్‌పెయిడ్ కస్టమర్లకు ఒకేసారి 30 జీబీ డేటా ఉచితంగా ఇవ్వనున్నట్లు ఎయిర్‌టెల్ ప్రకటించింది. ఈ డేటా కూడా రోల్‌ఓవర్ అవుతుంది. ఈ ఆఫర్‌కు మీరు అర్హులా కాదా తెలుసుకోవడానికి మీ ఎయిర్‌టెల్ నంబర్ నుంచి 51111కు కాల్ చేయండి లేదా మైఎయిర్‌టెల్ యాప్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. అర్హులైన కస్టమర్లకు 24 గంటల్లోపు ఫ్రీడేటాను యాక్టివేట్ చేస్తారు. గతంలో ఇదే మేరా పెహలా స్మార్ట్‌ఫోన్ ఆఫర్ కింద లెనోవో, సెల్కాన్, నోకియా, ఇంటెక్స్, సామ్‌సంగ్ మొబైల్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకొని కస్టమర్లకు రూ.2 వేల వరకు క్యాష్‌బ్యాక్ అందించింది.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos