ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్ టెల్ మరోసారి ఆఫర్ల వర్షం కురిపించింది. ఇప్పటికే కొత్త కొత్త ప్లాన్ లను ప్రవేశపెడుతున్న ఎయిర్ టెల్ .... తాజాగా మరో ప్లాన్ ని ప్రవేశపెట్టింది. కేవలం 98 రూపాయలకు 5జీబీ మొత్తంలో 3G/4G మొబైల్ డేటా ఈ ప్లాన్ ద్వారా లభిస్తుంది. ఈ లెక్కన ఒక GBకి కేవలం 19.6 పైసలు మాత్రమే పడుతుంది. ఇది 28 రోజుల వ్యాలిడిటీని కలిగి ఉంటుంది.

ఇది ఓపెన్ మార్కెట్ ప్లాన్ అవకపోవడం వల్ల అందరూ యూజర్లకు లభించదు. కొన్ని టెలికం సర్కిళ్లలో ఎక్కువమందికీ, మరికొన్నింటిలో తక్కువ మందికి మై ఎయిర్ టెల్ యాప్ లో ఈ ప్లాన్ కనిపిస్తోంది. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల్లో నివసించే అధిక శాతం మందికి మై ఎయిర్ టెల్ యాప్ లో బెస్ట్ ఆఫర్స్ ఫర్ యు అనే విభాగంలో ఈ ప్లాన్ వివరాలు ఉన్నాయి. 5 జీబీ డేటాని 28 రోజుల వ్యవధిలో ఎప్పుడైనా వాడుకోవచ్చు. ఎలాంటి రోజువారీ పరిమితులు ఉండవు.