అమ్మకానికి ఐడియా,ఎయిటెల్ నెటిజన్ల కామెడీ పంచ్ లు
సోషల్ మీడియా వచ్చిన తరువాత ప్రపంచ చాలా చిన్నదిగా మారింది. ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగిన అందిరికి క్షణాలలో తెలిసిపోతుంది. నెట్ ఎవరు ఏ జోక్ వేసిన అంతర్జాలంలో ఉన్న నెటిజన్లే కాక ప్రపంచ వ్యాప్తంగా అందరు పగలబడి నవ్వుతున్నారు. ఇప్పుడు అందరికి అదే పెద్ద సరదా అయింది.
ముఖేష్ అంబానీ తన సంస్థ 40 వ వార్షీకోత్సవం సందర్భంగా భారతీయులకు 1500 తో కూడిన డిపాజిట్ ఫ్రీ 4జీ ఫోన్ ను ప్రకటించారు. ఇప్పుడు దేశ వ్యాప్తంగా ప్రజలు ఇదే విషయాన్ని చర్చిస్తున్నారు. అంబానీ అగష్టులో ఫ్రీ ఫోన్ సరఫరా ప్రారంభిస్తే ఎయిర్‌టెల్, ఐడియాలు ఒఎల్ఎక్స్ లో అమ్మాకానికి పెట్టుకోవాలని ఓ యూజర్ అన్నారు. దానికి మరో యూజర్ కొనడానికి ఎవడున్నాడు భయ్య అంతా ధైర్యవంతుడు, కొనుగోలు చేసిన జియో లాంటి కొరివితో గొక్కొవడం ఎందుకు అని ట్విట్ చేశాడు.

ఇక మరో యూజర్ జీరోకి ఉన్న ప్రాధాన్యత ప్రపంచానికి ఇప్పుడు అర్థమైంది అన్నాడు.(జీరోని కనిపెట్టింది ఆర్యభట్ట ) మరో యూజర్ అంబానీ గారు ఇండియా ఉన్న అన్ని కుటుంబాలకు ఫ్రీగా కిరాణా వస్తువులు ఇవ్వండని ట్విట్ చేశారు. ఇప్పుడు దేశ వ్యాప్తంగా జియో ఫ్రీ మోబైల్ పైన చర్చ సాగుతుంది.
