బరువు పెరిగారని 57 మంది ఉద్యోగులకు తాత్కాలికంగా ఉద్వాసన పలికిన ఏయిర్ ఇండియా

పని చేయకపోతే ఉద్యోగం నుంచి తీసేసే కంపెనీలు చూశాం కానీ, బరువు పెరిగితే కూడా ఉద్యోగం తీసేసే కంపెనీల గురించి కనీసం విన్నామా.. అయితే వినండి...

ఏయిర్ ఇండియా ఈ పనిచేసి తన ప్రత్యేకతను చాటుకుంది. మా విమానం ఎగరాలంటే ఇకపై మీరు ఉద్యోగానికి రావాల్సిన అవసరంలేదు అని 57 మంది ఉద్యోగులకు ఊస్టింగ్ లెటర్లు ఇచ్చింది ఈ సంస్థ. బరువు పెరిగాకే మళ్లీ ఉద్యోగానికి రండి అని ఓ ఉచిత సలహా కూడా ఇచ్చింది.

కేవలం బరుకు ఎక్కువగా ఉన్నారనే ఒకే ఒక్క కారణం చూపుతూ ఇలా ఏకంగా 57 మంది ఉద్యోగలకు తాత్కాలికంగా ఉద్వాసన పలికింది. పాపం...ఇలా జాబ్ పోయిన వాళ్లందరూ కూడా ఎయిర్ హోస్టెస్ లే.

18 నెలల్లో మళ్లీ బరువు తగ్గండి లేదంటే ఇకపై శాశ్వితంగా ఉద్యోగాలు వదిలేయాల్సిందే అని వారికి గట్టి వార్నింగ్ ఇచ్చిన ఏయిర్ ఇండియా వారిని వేరే చోట తాత్కాలిక ఉద్యోగుల మాత్రం నియమించుకుంది.