సీఎంకి తృటిలో తప్పిన ప్రమాదం

సీఎంకి తృటిలో తప్పిన ప్రమాదం

ఎయిర్ ఇండియా విమానానికి శుక్రవారం తృటిలో ప్రమాదం తప్పింది. ఆ విమానంలో మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ ఉండటం గమనార్హం. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఎయిర్ ఇండియా ఎయిర్ లైన్స్ కి చెందిన  విమానం దేశరాజధాని ఢిల్లీ నుంచి ఇంఫాల్ వయా గౌహతి వెళ్లాల్సి ఉంది. 160మంది ప్రయాణికులతో ఢిల్లీలో బయలుదేరిన విమానం గౌహతి ఎయిర్ పోర్టులో ల్యాండ్ అవుతుండగా.. విమానానికి పక్షి తగిలింది. దీంతో... అప్రమత్తమైన పైలెట్.. విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు.

విమాన  విషయాన్ని మణిపూర్ సీఎం బిరేన్.. తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తాను ప్రయాణిస్తున్న విమానానికి పక్షి తగిలిందని, గౌహతిలో సురక్షితంగా ల్యాండ్ అయ్యిందని తెలిపారు. ఇదే విషయాన్ని ఎయిర్ ఇండియా ప్రతినిధి కూడా ధ్రవీకరించారు. అయితే.. విమానం గౌహతిలో ఆగిపోవడంతో.. ఇంఫాల్ వెళ్లాల్సిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ప్రయాణికుల కోసం ఎయిర్ ఇండియా సంస్థ మరో విమానాన్ని ఏర్పాటు చేయకపోవడం పట్ల పలువురు ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM NEWS

Next page