పార్టీ అధికార చానెళ్లోనే అమ్మ మృతిపై గాలి వార్తలు దాన్ని అనుసరించిన మిగిలిన చానెళ్లు మరణవార్తను ఖండించిన అపోలో ఆస్పత్రి యాజమాన్యం

స్వామి భక్తి ఎక్కువైతే బహుశా ఇలానే ఉంటుందేమో.. అడుగడుగునా ‘అమ్మ’ ప్రచారమే లక్ష్యంగా ఏర్పాటైన ఏఐడీఎంకే అధికారక చానెల్ తన తొందరపాటు చర్యతో అమ్మనే చంపేసింది.. వార్తల్లో...

సాయంత్రం 5.30 కు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఇక లేరు అంటూ ఏఐడీఎంకే అధికారక చానెల్ జయ టీవీ వార్తలు ప్రసారం చేసింది.

దీంతో అమ్మ చానెళ్లే అలా చేస్తుంటే ఇక అది నిజమే అనుకొని అన్ని చానెళ్లు దాన్నే అనుసరించాయి. చివరికి అపోలో ఆస్పత్రి వద్ద జయ అభిమానులు రాళ్లు రువ్వడంతో ఆస్పత్రి యాజమాన్యం ఎట్టకేలకు స్పందించింది.

కొన్ని వార్తా చానెళ్లలో వస్తున్నట్లు అమ్మ చనిపోయిందన్న వార్త నిజం కాదని, ఇంకా ఆమెకు ట్రీట్మెంట్ కొనసాగుతోందని హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.