పేరుకే నిరాహారదీక్ష..బీరు, బిర్యానీ లాగించేస్తున్నారు

పేరుకే నిరాహారదీక్ష..బీరు, బిర్యానీ లాగించేస్తున్నారు

ప్రజల కోసం నిరాహార దీక్ష చేస్తున్నామంటూ.. బిల్డప్ ఇచ్చి.. చివరకు బీరు, బిర్యానీలు లాగించేస్తూ కెమేరాకు చిక్కారు అన్నాడీఎంకే కార్యకర్తలు. కావేరీ మేనేజ్‌మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలంటూ కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా అన్నాడీఎంకే శ్రేణులు ఒకరోజు నిరాహార దీక్ష చేసిన విషయం తెలిసిందే. అయితే వెల్లూరు, కోయంబత్తూర్, సేలంలాంటి జిల్లాల్లో పార్టీ కార్యకర్తలు ముందు వేదికపై నిరాహార దీక్షకు కూర్చుంటూ.. వెనుక మాత్రం మందు, బిర్యానీ లాగించేశారు. కాగా.. అలా వాళ్లు బిర్యానీలు తింటూ కెమేరా కన్నుకి చిక్కారు.

ఇంకేముంది.. నిరాహార దీక్ష ఇంత బ్రహ్మాండంగా చేస్తున్నారా అంటూ విమర్శలు మొదలయ్యాయి. ఈ నిరాహార దీక్షలో తమిళనాడు మంత్రివర్గం మొత్తం పాల్గొన్న సంగతి తెలిసిందే. కాగా.. కార్యకర్తలు చేసిన పని ఇప్పుడు అధికార పార్టీకి తలనొప్పిగా మారింది. కేంద్రంపై ఒత్తిడి తీసుకు రాలేకపోతున్నారని ఇప్పటికే అధికార పార్టీపై తీవ్ర ఒత్తిడి ఉన్న నేపథ్యంలో ఇప్పుడీ వీడియోలు బయటకు రావడం మరిన్ని చిక్కుల్లోకి నెట్టింది. నిరాహార దీక్షల వేదికలకు దగ్గరగానే ఈ మందు, బిర్యానీ అడ్డాలు ఏర్పాటు చేసుకోవడం గమనార్హం.

 

 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos