బిరియానీ, చోటావాల సమోసా, ఇరానీ చాయ్, ఉస్మానియా బిస్కెట్

 

వీటిలో విశేషమేమిటి ?

 

ప్యూర్... 100 పర్సెంట్... హైదరాబాదీ.

 

ఈ లిస్టులోకి మరొకటి వచ్చి చేరింది.

 

అది అగ్ని5  మిసైల్

 

నోట్ల రద్దు హాహాకారాల మధ్య మనకుపెద్ద గా వినిపించలేదుగాని, సోమవారం నాడు  భారత దేశం ప్రయోగించిన అగ్ని-5 మిసైల్   ఎ టు జడ్ హైదరాబాద్ లోనే తయారయింది.

 

మిసైల్ రూపకల్పన చేసింది, తయారు చేసింది మొత్తం హైదరాబాద్ లోనే. అగ్ని 5 ప్రాజక్టు మీద దాదాపు 200 మంది హైదరాబాద్, కంచన్ బాగ్ డిఫెన్స్ లాబొరేటరీలలో ఉన్న శాస్త్రవేత్తలు పనిచేశారు. వీళ్లు కాకుండా గత అగ్రి శ్రేణి  మిసైల్స్ మీద పనిచేసిన మరొక 100 మంది హైదరాబాదీలు కూడా ఇందులో పాలుపంచుకున్నారట.

 

అగ్రి మిసైల్ వాడిని విడిభాగాలు కూడా దాదాపు అన్నీ హైదరాబాద్ లోనే తయారయ్యాయట.   విడిభాగాల డిజైన్ లను హైదరాబాద్ లోని కంచన్ బాగ్ లోని డిఫెన్స్ లాబొరేటరీలు అందిస్తే  ఇతర హైదరాబాద్ యూనిట్లు వాటిని తయారుచేశాయట.

 

అగ్ని 5  తయారీలో పాలుపంచుకున్న సంస్థలు: ఎపిజె అబ్దుల్ కలాం మిసైల్ కాంప్లెక్స్, అడ్వాన్స్ డ్ సిస్టమ్స్ లాబొరేటరీ (ఎఎస్ ఎల్ ), డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ లాబొరేటరీ (డిఆర్ డి ఎల్).

 

అగ్ని5 ను తయారు చేశాక, ప్రత్యేక ట్రక్కుల మీద దానిని ఒరిస్సాలోని వీలర్ ఐలండ్ క్షిపణి ఫ్రయోగ కేంద్రానికి తరలించారు.

 

అగ్ని 5 మొదటి ప్రయోగం 2012 జరిగింది.

 

చైనాలో మారుమూల ఉన్న లక్ష్యాన్ని కూడా ఛేదించే  ఈ  హైదరాబాదీ అగ్ని 5 రేంజ్ 5 వేల కిలోమీటర్లు. అయితే, కొద్ది గా మార్పుచేస్తే ఎనిమిది నుంచి పదివేల కిలో మీటర్ల  దూరాన కూడా నిప్పులు చిమ్మగలదని చెబుతున్నారు.

 

లాంగ్ రేంజ్ మిసైల్స్ ఉన్న  అమెరికా, రష్యాు, ఇంగ్లండ్, చైనా, ఫ్రాన్స్ ల మధ్య భారత్ ని కూచో బెట్టింది ఇపుడు హైదరాబాదే...