అజ్ఞాతవాసి మ్యూజిక్ రివ్యూ

First Published 20, Dec 2017, 2:42 PM IST
agnathavasi musical review is here
Highlights
  • పవన్ కళ్యాణ్ హీరోోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తోన్న అజ్ఞాతవాసి
  • అజ్ఞాతవాసిలో పవన్ సరసన హిరోయిన్లుగా కీర్తి సురేష్, అను ఎమ్మాన్యుయెల్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం అజ్ఞాతవాసి. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో జల్సా, అత్తారింటికి దారేది చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి సందడి చేశాయి. ఈ రెండు సినిమాలు బిగ్ హిట్ గా నిలిచిన సంగతి అందరికీ తెలిసిందే.  ఈ సినిమాలు ఎంత హిట్టో.. ఆ సినిమాలోని పాటలు కూడా అంతే హిట్టయ్యాయి. మరోసారి బ్లాక్ బస్టర్ కొట్టడానికి సిద్ధమైన పవన్-త్రివిక్రమ్ ల ఈ అజ్ఞాతవాసి సినిమా మ్యూజిక్ ని బుధవారం విడుదల చేశారు. మరి ఈ సినిమా పాటలు జనాలను ఎంత మేర మ్యాజిక్ చేస్తున్నాయో.. ఇప్పుడు చూద్దాం..  ఈ సినిమాలో పవన్ సరసన క్రేజీ హీరోయిన్స్. కీర్తిసురేష్, అను ఎమ్మాన్యుయల్ లు నటిస్తున్నారు.ఈ చిత్రానికి సంగీతం అనిరుధ్ రవిచందర్ అందించారు. తెలుగులో ఓ సినిమాకి సంగీతం అందించడం అనిరుధ్ కి ఇదే తొలిసారి కావడం విశేషం.

1. ధగ ధగమనే..(సాంగ్).. అనిరుధ్..(సింగర్) శ్రీమణి( లిరిక్స్)

‘‘ధగధగమనే తూరుపు దిశ’’.. ఈ సాంగ్ ని మ్యూజిక్ డైరెక్టర్ కమ్ సింగర్ అనిరుధ్ పాడారు. అనిరుధ్ కెరియర్ లో బెస్ట్ సాంగ్ గా నిలిచే అవకాశం ఉంది. ఈ పాటకి అనురుధ్ వాయిస్ మరో ప్లస్. ఒకవైపు రాక్ సాంగ్ విన్న ఫీలింగ్ కలుగుతూనే మరోవైపు క్లాసీగా ఉంది. పవన్ కి పర్ ఫెక్ట్ ఇంట్రో సాంగ్  ఇది.

2.బయటకొచ్చి చూస్తే..(సాంగ్), అనిరుధ్( సింగర్), శ్రీమణి( లిరిక్స్)

‘‘బయటకొచ్చి చూస్తే టైంఏమో’’.. ఈ సాంగ్ ని ఆడియో ఫంక్షన్ కి ముందుగానే విడుదల చేశారు. విడుదల చేసిన కొద్ది సేపటికే వైరల్ గా మారింది. ఈ స్వీట్ మెలడీ సాంగ్.. మ్యూజిక్ లవర్స్ ని ఇప్పటికే కట్టిపడేసింది.

3.స్వాగతం కృష్ణ..(సాంగ్).. నిరంజనా రామన్( సింగర్)

‘‘స్వాగతం కృష్ణ’’.. ఈ సాంగ్ ఒక భక్తిపాట. దీని ఒరిజినల్ కంపోజర్ ఓతుకాడు వెంకటసుబ్బియార్. దీనిని అనిరుధ్ ఈ  సినిమా కోసం ఉపయోగించారు. ఈ ట్రెడిషనల్ కర్నాటక పాటన నింరజనా రామన్ చాలా అద్భుతంగా ఆలపించారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అనురుధ్ చాలా తెలివిగా అందించారు. అత్తారింటికి దారేదిలో దేవదేవం పాటకి ఎంత గుర్తింపు వచ్చిందో అంతే గుర్తింపు ఈ పాటకి వస్తుందనడంలో సందేహం లేదు.

4.గాలివాలుగా..(సాంగ్), అనిరుధ్( సింగర్), సిరివెన్నెల సీతారామశాస్త్రి( లిరిక్స్)

‘బయటకొచ్చి చూస్తే’ ఈ పాట తర్వాత విడుదలైన మరో పాట ‘గాలి వాలుగా’. ఈ పాట కూడా విడుదలైన కొద్ది సేపటికే మ్యూజిక్ లవర్స్ ని కట్టిపడేసింది. ఈ పాటకి స్పానిష్ టచ్ ఇచ్చినట్లుగా ఉంది. ఈ పాటకి అనిరుధ్ గిటార్, వయోలిన్ ఎక్కువగా వినియోగించారు. అనిరుధ్ పాడిన విధానం కూడా చాలా బాగుంది.

5.ఏబీ ఎవరో నీ బేబీ(సాంగ్), నకష్  అజిజ్, అర్జున్ చాందీ(సింగర్స్), శ్రీమణి(లిరిక్స్)

ఈ పాట కూడా వినడానికి బాగుంది. నకష్  అజిజ్, అర్జున్ చాందీలు ఈ పాట పాడారు. బీట్స్ బాగున్నాయి. ఓవరాల్ గా పర్వాలేదనిపిస్తోంది.

loader