మళ్లీ జగన్ గూటికి గౌతమ్ రెడ్డి

again gowtham reddy reunion with ycp
Highlights

గౌతమ్ రెడ్డి పై సస్పెన్షన్ ఎత్తివేత

వైసీపీ నేత గౌతం రెడ్డిపై సస్పెన్షన్ ఎత్తి వేశారు. గతేడాది గౌతం రెడ్డి పై జగన్ సస్పెన్షన్ వేటు వేయగా.. అతను ఇంతకాలం పార్టీకి దూరంగా ఉంటూ వచ్చాడు. కాగా.. ఇప్పుడు ఆ సస్పెన్షన్ ఎత్తి వేశారు. దీంతో.. శనివారం గౌతం రెడ్డి జగన్ పాదయాత్రలో పాల్గొన్నారు.
గౌతం రాకతో.. చాలా మంది వైసీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు.

గతేడాది ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ గౌతం రెడ్డి వంగవీటి రంగా గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. వంగవీటి రంగా, రాధలను చంపడం దారుణమని ఎందుకంటారని, రౌడీ రాజకీయాలే పరమావధిగా ముందుకెళ్లే వారు పోస్టుమార్టానికి వెళ్లాల్సిందేనని గౌతంరెడ్డి అన్నారు. ఆయన తన వ్యాఖ్యలను సమర్థించుకుంటూ ఓ కథ కూడా చెప్పారు. ఓసారి ఓ పాము కనిపించిన వారినందరినీ కాటువేసుకుంటూ వెళ్తూ చివరికి ఓ దేవుడి ఫొటో వెనక దాక్కుందని, కానీ తమను కాటువేసిన పాము దేవుడి ఫొటో వెనక దాక్కుంది కదా.. అని జనాలు చంపడం మానేస్తారా? అని ప్రశ్నించారు.

నిరాహార దీక్షలో ఉన్నా, ఇంకెక్కడ ఉన్నా రౌడీ రాజకీయాలు చేసే వారి భవిష్యత్ పోస్టుమార్టమేనంటూ తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు. రౌడీ రాజకీయాలు వదిలి తమలాగా రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. వాళ్లు వచ్చిన తర్వాతే కుల రాజకీయాలు బయటకు వచ్చాయని ఆరోపించారు. వారు ఈ కులం వారిని చంపితే, వారు ఈ కులం వారిని చంపడం మొదలుపెట్టారని గౌతం రెడ్డి ఆరోపించారు. కాగా.. ఈ వ్యాఖ్యలు విజయవాడలో దుమారం రేపాయి. వైసీపీ పై తీవ్ర వ్యతిరేకత కూడా నెలకొంది. దీంతో.. జగన్ అతనిని సస్పెండ్ చేశాడు.అయితే.. వైసీపీకి మద్దతుగా ఉన్న వంగవీటి రాధా.. గౌతమ్ రెడ్డ రాకను స్వాగతిస్తాడో లేదో చూడాలి.

loader