వరసగా ఆరోరోజు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. అంతర్జాతీయ ముడిచమురు ధరలు పెరగడం, అధిక డిమాండ్ కారణంగా పెట్రోల్ ధరలు ఆకాశానంటుతున్నాయి.మెట్రో నగరాల్లో  లీటర్ పెట్రోల్ ధర రూ.80కి చేరుకుంది. డీజిల్ ధర కూడా లీటర్ కి రూ.67కి చేరుకుంది. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతో వాహనదారులు బెంబేలెత్తుతున్నారు.

 

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు పెరగడం, ఒపెక్‌ దేశాల్లో చమురు ఉత్పత్తులపై నియంత్రణలతో ఇంధన ధరలకు రెక్కలొచ్చాయి. ఇక రూపాయి మారకం, పెట్రో ఉత్పత్తులపై సుంకాలతో దేశీయ వినియోగదారులు పెట్రో ధరలపై ఎక్కువ చెల్లించాల్సి వస్తోంది. పెట్రో ఉత్పత్తులపై పన్ను భారం తగ్గించాలని కేంద్రాన్ని కోరుతుంటే రాష్ట్రాలు పెట్రోల్‌పై వ్యాట్‌, ఇతర పన్నులను తగ్గించాలని కేంద్రం కోరుతోంది. ఈ ఏడాది జనవరి 24వ తేదీ నుంచి పెట్రోల్ ధర మూడేళ్ల గరిష్టస్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే.