త్వరలో ఫోన్లను పేపర్ మడత పెట్టినట్టు మడత పెట్టొచ్చు అంటోంది శాంసంగ్ కంపెనీ. త్వరలోనే ఈ తరహా స్మార్ట్ ఫోన్ ని విడుదల చేస్తామని కంపెనీ చెబుతోంది. ఆదివారం బార్సిలోనాలో శాంసంగ్ కంపెనీ.. గెలాక్సీ ఎస్9, గెలాక్సీ ఎస్9 ప్లస్ ఫోన్లను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫోన్ల ను సంస్థ సీఈవో డి.జె.కోహ్ విడుదల చేశారు. కాగా.. విడుదల అనంతరం తమ సంస్థ నుంచి త్వరలో రానున్న పలు ఫోన్ మోడల్స్ గురించి ఆయన మాట్లాడారు.

అందులో భాగంగానే త్వరలో మడత పెట్టే ఫోన్లను తీసుకురానున్నట్లు చెప్పారు. అంతేకాకుండా శాంసంగ్ కంపెనీ.. ఎటువంటి పోటీ లేని కొత్త సెగ్మెంట్ లోకి త్వరలో అడుగుపెట్టబోతోందని వివరించారు. త్వరలోనే దీని గురించి పూర్తి విషయాలను వెల్లడిస్తామన్నారు.