జియో, ఎయిర్ టెల్ ల పోటీని తట్టుకునేందుకు ఐడియా బాగానే కష్టపడుతోంది. అందుకే కష్టమర్లను ఆకర్షించేందుకు కొత్త కొత్త ప్లాన్లు, ఆఫర్లు ప్రవేశపెడుతోంది. తాజాగా..ఐడియా ఓ సరికొత్త ప్లాన్ తీసుకువచ్చింది.
ప్రతిరోజు 2జీబీ చొప్పున మొబైల్ డేటా అందించే సరికొత్త ప్లాన్‌ని ఐడియా ప్రవేశపెట్టింది. రూ. 249 తో రీఛార్జ్ చేసుకుంటే చాలు, ప్రతిరోజు 2జీబీ చొప్పున 28 రోజుల పాటు మొత్తం 56జీబీ మొబైల్ డేటా లభిస్తుంది. అలాగే అపరిమితమైన వాయిస్ కాల్స్ కూడా చేసుకోవచ్చు. లోకల్ కాల్స్ తో పాటు రోమింగ్ కాల్స్ కూడా ఉచితంగా లభిస్తాయి.

అయితే కేవలం కొద్ది మంది వినియోగదారులకు మాత్రమే ఈ సరికొత్త రూ. 249 లభిస్తోంది. ఇది అతి త్వరలో ఓపెన్ మార్కెట్ ప్లాన్‌గా అందరూ వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. కొద్దిరోజుల క్రితం ఎయిర్ టెల్ సంస్థ రూ.249 రూపాయలకి ఇదే రకమైన ప్రయోజనాలతో ప్లాన్ తీసుకు వచ్చిన నేపథ్యంలో  ఐడియా ఈ ప్లాన్ ని తీసుకువచ్చింది. మరోవైపు జియో కేవలం రూ.198 కే  28 రోజుల పాటు రోజుకి 2 జీబీ మొబైల్ డేటా అందిస్తున్న విషయం తెలిసిందే.