క్యాస్టింగ్ కౌచ్ పై గట్టి పోరాటం చేయాలి..

First Published 12, Apr 2018, 1:04 PM IST
actress pooja hegde shocking comments on casting caouch
Highlights
క్యాస్టింగ్ కౌచ్ పై పూజా హెగ్డే షాకింగ్ కామెంట్స్

‘ ముకుందా’ చిత్రంతో తెలుగు చిత్ర సీమకు పరిచయం అయ్యింది పూజా హెగ్డే. దాని తర్వాత మరో ఒకటి రెండు సినిమాలు చేసినా.. పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ.. అల్లు అర్జున్ హీరోగా నటించిన దువ్వాడ జగన్నాథమ్ తో పూజా ఫేటే మారిపోయిందని చెప్పొచ్చు.ఇప్పుడు వరస ఆఫర్లతో దూసుకుపోతోంది. ఇటీవలే రంగస్థలంలో ‘ జిల్ జిల్ జిగేలు రాణి’ అంటూ స్టెప్పులు వేసి సందడి చేసింది. ఈ సందర్భంగా పూజా..ఓ ప్రముఖ న్యూస్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు మాట్లాడారు.క్యాస్టింగ్ కౌచ్ గురించి కూడా పూజా స్పందించారు.

‘‘ఈ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కూచ్ ఉందేమో నాకు తెలీదు.నేనయితే ఎప్పుడూ అలాంటి వేధింపులు ఎదుర్కోలేదు. వాటిని ఎదుర్కొన్నవారు చెబుతుంటే చాలా బాధ అనిపిస్తోంది. అమ్మాయిలు ఈ రంగంలోకి రావడానికి రకరకాల కారణాలు ఉండొచ్చు. కొందరు డబ్బు సంపాదించడానికే వస్తే చాలా మంది నటన మీద ఉన్న ఇష్టంతో వస్తుంటారు. అలాంటివారిని వేధింపులకు గురిచేయడం అన్యాయం. వీటి మీద గట్టి పోరాటమే చేయాలన్నది నా అభిప్రాయం. అందరూ ఒక్కటిగా కలిస్తేనే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం ఉంటుంది. లేకపోతే, కేవలం వార్తలకే పరిమితం అవుతుంది. ఏ ఒక్కరో తీసుకోవలసిన నిర్ణయం కాదన్నది నా అభిప్రాయం.’’ అని పూజా తెలిపారు. 

loader