ప్రముఖ తెలుగు సినీ నటుడు సాయికుమార్ వెనుకంజలో ఉన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన భారతీయ జనతా పార్టీ అభ్యర్ధిగా బాగేపల్లి నుంచి పోటీలో ఉన్నారు. అయితే... నేడు ఓట్ల లెక్కింపు జరుగుతుండగా ప్రస్తుతం ఆయన వెనుకంజలో ఉన్నారని సమాచారం. కాగా... స్థానిక అభ్యర్ధిని కాదని ఎంతో ఒత్తిడి మేరకు సాయికుమార్‌కు బీజేపీ అధిష్టానం టికెట్ కేటాయించింది. అయినప్పటికీ ఆయన గెలుపు దిశగా పయనించలేకపోతున్నారు. ఆయన అనంతపురం జిల్లాలోని కదిరి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే..

మొదట ఆ సీటును వేరే అభ్యర్థికి కేటాయించాలని బీజేపీ నేతలు భావించారు. అయితే.. సాయికుమార్ అభిమానులు ఆందోళనలు చేయడంతో తిరిగి ఆయనకే కేటాయించారు.  తెలుగువారు ఎక్కువగా ఉన్న ప్రాంతం కాబట్టి సాయి కుమార్ ద్వారా లబ్ధి చేకూరుతుందని బీజేపీ భావించింది. అయితే.. వారు అనుకున్నది జరగలేదు. సాయికుమార్ వెనకపడిపోయారు.