యాక్ట్ ఫైబర్ నెట్ వినియోగదారులకు శుభవార్త

ACT Fibernet Gifting 250GB Data to Broadband Customers as T20 Data Surprise
Highlights
250 జీబీ మొబైల్ డేటా ఫ్రీ


యాక్ట్ ఫైబర్ నెట్ వినియోగదారులకు శుభవార్త.  యాక్ట్ ఫైబర్ నెట్ సంస్థ తన ఖాతాదారులు అందరికీ ఏకంగా 250 జీబీ అదనపు  బ్రాడ్  బ్యాండ్ డేటాను ఉచితంగా అందిస్తోంది.

ఐపీఎల్ 2018 సీజన్‌ని దృష్టిలో ఉంచుకొని టీ20 డేటా సర్ ప్రైజ్ పేరిట  ఈ బహుమానం అందిస్తోంది. వినియోగదారులు ఎలాంటి అంతరాయం లేకుండా ఐపీఎల్ లో 
అన్ని క్రికెట్ మ్యాచ్‌లను ఆన్లైన్లో చూడ్డానికి వీలుగా ఈ డేటా అందించబడుతోంది. కచ్చితంగా ఇది క్రికెట్ అభిమానుల్ని సంతోషపరుస్తుందనడంలో సందేహమే లేదు. 
ఒకవేళ మీరు క్రికెట్ చూడకపోయినా.. ఈ అదనపు డేటాని వేరే అవసరాలకు వినియోగించుకోవచ్చు.

ఈ 250 జీబీ డేటా మే 31 వరకూ వేలిడిటీ కలిగి ఉంటుంది. ఈ లోపు మీరు ఎప్పుడైనా దాన్ని వినియోగించుకోవచ్చు. ఈరోజు నుండి మొదలయ్యే ఐపీఎల్ మ్యాచులను 
హాట్ స్టార్ లో ప్రీమియం సబ్ స్క్రిప్షన్ ద్వారాగానీ, లేదా 299 రూపాయల విలువైన  స్పోర్ట్స్ ప్యాక్ ద్వారా గానీ వీక్షించవచ్చు. అలాగే  ఎయిర్ టెల్ వినియోగదారులు ఎయిర్ టెల్ అప్లికేషన్లోనూ, జియో వినియోగదారులు జియో టీవీ అప్లికేషన్‌లోనూ ఈ మ్యాచ్‌లను చూడడానికి అవకాశముంది.

loader