ప్రపంచంలోకెల్లా అతి పలచని ల్యాప్ టాప్ ఇది

Acer unveils Swift 7 the worlds thinnest laptop at CES 2018
Highlights

  • ఈ ల్యాప్ టాప్ వెడల్పు కేవలం 8.99మిల్లీ మీటర్లే

ఏసర్ కంపెనీ.. తాజాగా మరో కొత్త ల్యాప్ టాప్ లను విడుదల చేసేందుకు  సిద్ధమైంది. లండన్ లో జరగున్న సీఈఎస్( కన్జ్యూమర్స్ ఎలక్ట్రానిక్స్ షో)లో  ఏసర్ రెండు రకాల ల్యాప్ టాప్ లను ప్రదర్శనలో ఉంచనుంది. ఒకటి స్విఫ్ట్ 7 కాగా.. మరోకటి నిట్రో5 గేమింగ్ ల్యాప్ టాప్. స్విఫ్ట్ 7 పేరిట విడుదల చేస్తున్న ల్యాప్ టాప్ ప్రపంచంలోకెల్లా అత్యంత పలుచని ల్యాప్ టాప్ కావడం విశేషం. ఈ ల్యాప్ టాప్ వెడల్పు కేవలం 8.99మిల్లీ మీటర్లే. పేరుకి పలుచని ల్యాప్ టాప్ అయినప్పటికీ చూడటానికి మాత్రం చాలా బాగుంది అంటున్నారు నిపుణులు.

7జెనరేషన్ ఇంటెల్ కోర్ ఐ7 ప్రాసెసర్ తో ఈ ల్యాప్ టాప్ పనిచేస్తుంది. 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజీ, 14 ఇంచెస్ ఫుల్ హెచ్ డీ రెసొల్యూషన్ దీని ఫీచర్లు. అంతేకాదు ఇందులో నానో సిమ్ సపోర్ట్ చేస్తుంది. అంతేకాదు.. ఈ-సిమ్ టెక్నాలజీని ఎక్స్ టెండ్ చేసుకోవచ్చు. దీని ప్రారంభ ధర రూ.1,07,700 ఇది ఇతర కంపెనీల టాప్ మోస్ట్ ల్యాప్ టాప్ లతో పోటీపడుతోంది. ఇక ఏసర్ నుంచి వస్తున్న మరో ల్యాప్ టిప్ నిట్రో5 విషయానికి వస్తే.. ఇది ఫీచర్స్ విషయంలో చాలా బాగుంది. దీని ప్రారంభ ధర రూ.50వేల పైనే. ఇది గేమింగ్ ల్యాప్ టాప్.  ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఈ ల్యాప్ టాప్ మార్కెట్ లోకి రానుంది.

loader