చాందినీని  ఎలా చంపేశాడో ఒప్పుకున్న క్లాస్ మేట్

హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన ఇంటర్ విద్యార్థిని చాందినీ జైన్ హత్య కేసు మిస్టరీ వీడింది. పోలీస్ విచారణలో క్లాస్ మేట్ సాయికిరణ్ నేరాన్ని అంగీకరించాడు. అతడు చెప్పిన విషయాలు:

‘‘క్షణికావేశంలో చాందినిని చంపా. గొంతు పట్టుకున్న వెంటనే చాందిని చనిపోయింది. చాందిని స్పృహ తప్పిందనుకుని స్నేహితులకు సమాచారం ఇచ్చాను . ఈ సంఘటన అంతా ఐదు నిమిషాల్లో జరిగింది. స్నేహితులు వచ్చి చాందిని చనిపోయిందని చెప్పారు. భయంతో అక్కడి నుంచి పారిపోయాను.’’

సాయికిరణ్ చెప్పిన మరిన్ని వివరాలు

‘‘ఆరేళ్ల నుంచి చాందినితో పరిచయం ఉంది. కొన్నాళ్ల క్రితం ఆమెను నాకు దూరం చేశారు. పెద్దవాళ్లకు తెలియకుండా మా స్నేహం కొనసాగింది. పెళ్లి చేసుకోవాలని పదేపదే ఒత్తిడి తెచ్చేది. 9వ తేదీ సాయంత్రం కలుద్దామని తానే ఫోన్‌ చేసింది. నేను చాందిని ఇంటికి వెళ్లాను. తర్వాత ఎప్పుడూ కలుసుకునే అమీన్‌పూర్‌ ప్రాంతానికి ఆటోలో వెళ్లాం. మళ్లీ పెళ్లి ప్రస్తావన తెచ్చింది. కెరీర్‌లో సెటిలైన తర్వాత చేసుకుందామని చెప్పినా వినకుండా గొడవకు దిగింది. కోపంతో ఆమెను కొట్టాను. గట్టిగా కేకలు పెట్టడంతో ఆమె గొంతు పట్టుకున్నాను. ఆమె స్పృహ తప్పిపడిపోయిందనుకున్నాను.’’

చాందిని హత్య జరిగిన స్థలానికి సాయి కిరణ్ ను పోలీసులు తీసుకెళ్లారు. అమీన్ పూరా గుట్టలో హత్య ఎలా జరిగిందో పోలీసులు సీన్ రీకన్ స్ట్రక్షన్ చేస్తున్నారు

చాందినీ హత్య గురించిన మరిన్ని వివరాలు