టీం ఇండియా క్రికెటర్ షమీ కేసులో ఆయన భార్య  హసీన్ జహాన్ ఊహించని ట్విస్ట్ ఇచ్చి షాక్ ఇచ్చింది. నిన్న, మొన్నటి వరకు షమీకి ఇతర మహిళలతో అక్రమ సంబంధాలు ఉన్నాయని, తనను హింసించాడని ఆమె ఆరోపించిన సంగతి తెలిసిందే.  ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. అంతేకాదు.. షమీ మ్యాచ్ ఫిక్సింగ్ పాల్పడ్డాడని కూడా హసీన్ ఆరోపించింది. కాగా.. ఆమె ఆరోపణలను బీసీసీఐ సీరియస్ గా తీసుకుంది. ఇప్పటికీ షమీ బీసీసీఐ సభ్యత్వాన్ని కూడా రద్దు చేసింది. తాజాగా..  ఈ విషయంపై పూర్తి నిజాలు తెలుసుకునేందుకు హసీన్ ని బీసీసీఐ అధికారులు విచారించారు. ఆమె పై ప్రశ్నల వర్షం కురిపించారు. సుమారు మూడుగంటల పాటు విచారించగా.. ఆమె నోరు మెదపకపోవడం గమనార్హం.

అంతేకాకుండా బీసీసీఐ విచారణ అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం ఆమె మీడియాతో మాట్లాడిన మాటలు వైరల్ గా మారాయి. తన భర్త షమీ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడంటూ తాను ఆరోపించినట్లు వస్తున్న కథనాల్లో వాస్తవం లేదని చెప్పింది. ఇంగ్లండ్‌కు చెందిన మమ్మద్ బాయ్ అనే వ్యక్తి సాయంతో పాకిస్థాన్ కి చెందిన అలిషబా అనే మహిళ నుంచి షమీ డబ్బులు తీసుకున్నాడని మాత్రమే చెప్పానంది.  తనకు అసలు క్రికెట్ ఆట గురించే ఎలాంటి అవగాహన లేదని, అలాంటప్పుడు భర్త షమీ మ్యాచ్ ఫిక్సింగ్ చేశాడని ఎలా ఆరోపిస్తానని జహాన్  ప్రశ్నించడం గమనార్హం. ఆమె మాటలను అందరూ ఖంగుతిన్నారు. ఇదిలా ఉండగా.. ఇదే విషయంపై బీసీసీఐ అధికారులు షమీని కూడా విచారించారు. దీనిపై త్వరలోనే నివేధిక ఇవ్వనున్నట్లు అధికారులు చెప్పారు.