కర్కూలు జిల్లాలో ఎంత విషాదం జరిగిందో చూడండి...

accident snuffs out lives brothers in Kurnool district
Highlights

ఇద్దరు అన్నదమ్ములు. అన్యోన్యంగా పెరిగారు. పెద్ద వారయ్యారు. ఇద్దరు ఒకే ఇంట్లో అక్కా చెల్లెళ్లను పెళ్లిచేసుకున్నారు. ఇక జీవితం సాఫీగా సాగుతుందనుకున్నపుడు .... ఇద్దరిని కలిపే మృత్యువు  తన వెంట తీసుకుపోయింది. అదికూడా కలసి అత్తగారింటికి వెళ్తుండగా. ఈ విషాదం కర్నూలు జిల్లా  ఎమ్మిగనూరు సమీపంలో హనుమాపురంలో జరిగింది.

 

ఇద్దరు అన్నదమ్ములు. అన్యోన్యంగా పెరిగారు. పెద్ద వారయ్యారు. ఇద్దరు ఒకే ఇంట్లో అక్కా చెల్లెళ్లను పెళ్లిచేసుకున్నారు. ఇక జీవితం సాఫీగా సాగుతుందనుకున్నపుడు .... ఇద్దరిని కలిపే మృత్యువు  తన వెంట తీసుకుపోయింది.

 

అదికూడా కలసి అత్తగారింటికి వెళ్తుండగా. ఈ విషాదం కర్నూలు జిల్లా  ఎమ్మిగనూరు సమీపంలో హనుమాపురం లో జరిగింది.

 

సోమవారంనాడు అన్నాదమ్ములు రఘు(38), బలరాముడు(36),  అత్తవారింటికి బయలుదేరారు. అత్తగారి వూరు  గోనెగండ్ల.  అన్నాదమ్ముళ్లిద్దరు అటో డ్రైవర్లు. రఘ భార్య సుజాత 20 రోజుల కిందట  పుట్టింటికి వెళ్లింది. ఆమెను తీసుకు సంతోషంగా రఘ బయలు దేరాడు. ఇద్దరికి అత్తగారి ఇల్లే కాబట్టి తనతో పాటు తమ్ముడు బలరాముడిని కూడా పిలుచుకుని ఆటోలో బయలుదేరాడు.

ఎర్రకోట ఇంజినీరింగ్‌ కళాశాల దగ్గరికి చేరుకున్నారు. అంతే,  కర్నూలు నుంచి అనంతపురం జిల్లా రాయదుర్గం వెళ్తున్న ఆర్టీసీ బస్సు (ఏపీ 02జెడ్‌ 0160) ఆటోను ఎదురుగా ఢీకొట్టింది. ఆటో కుక్కిన పేనులా తయారయింది. డ్రైవింగ్‌ చేస్తున్న రఘు అందులోనే ఇరుక్కుపోయి అసువులబాశాడు. తీవ్ర గాయపడిన బలరాముడిని అక్కడున్న వారు వెంటనే 108ను పిలిపించి ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తలకు బలమైన గాయం ఉండటంతో ప్రథమ చికిత్స చేసి కర్నూలు ప్రభుత్వాసుపత్రికి రెఫర్‌ చేశారు. అక్కడికి తరలిస్తుండగా మార్గమధ్యంలోని కె.నాగలాపురం వద్ద బలరాముడు మృతి చెందాడు. ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

 

రఘుకు భార్య సుజాతతో పాటు కుమారుడు చంద్ర(4), బలరాముడికి భార్య లక్ష్మీతో పాటు కుమారుడు, కుమార్తె ఉన్నారు.

loader