Asianet News TeluguAsianet News Telugu

మరో అవినీతి జడ్జి ఇంట్లో ఏసీబి తనిఖీలు

బెయిలివ్వడానికి లంచం తీసుకున్నాడనాడన్న ఆరోపణలపై
ACB Raids on Metropolitan Sessions Judge Radha Krishna Murthy Residence

అవినీతి ఆరోపణలపై నేపథ్యంలో హైదరాబాద్ 1 వ అడిషినల్ మెట్రోపాలిటిన్ కోర్టు న్యాయమూర్తి రాధా కృష్ణ మూర్తి ఇంట్లో ఏసిబి అధికారులు దాడులు చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకే ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు ఏసీబీ అధికారులు చెబుతున్నారు. ఈయనపై ఇప్పటికే కేసు నమోదైన విషయం తెలిసిందే. పక్కా ఆధారాలతో జడ్జి ఇంటిపై దాడులు నిర్వహిస్తున్నట్లు  ఏసీబీ డిప్యూటీ డైరెక్టర్ రమణకుమార్ తెలిపారు.


గతంలో హైదరాబాద్లోని గాంధీ నగర్ లో డ్రగ్స్ కేసు లో ఓ నైజీరియన్ తో పాటు ఓ కళాశాల ప్రొపెసర్ కూడా అరెస్టయ్యాడు. అయితే ఈ ప్రొఫెసర్ దగ్గర 7  లక్షలు లంచం తీసుకున్నట్లు జడ్జ్ రాధా కృష్ణ మూర్తి పై ఆరోపణలున్నాయి. ఈ కేసులో ప్రొఫెసర్  బెయిల్  కోసం జడ్జీ మొత్తం 11  లక్షలు డిమాండ్ చేసి చివరకు 7 లక్షలకు సెటిల్ చేసుకున్నట్లు సమాచారం. ఈ ఆరోపణల నేపద్యంలో ఏసీబీ అధికారులు అల్వాల్‌లోని జడ్జి రాధాకృష్ణమూర్తి ఇంటితోపాటు మరో రెండుచోట్ల సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో రాధాకృష్ణమూర్తికి చెందిన ఆస్తులు, బ్యాంక్ లాకర్లు గుర్తించినట్లు ఏసిబి అధికారులు వెల్లడించారు.  


 

Follow Us:
Download App:
  • android
  • ios