Asianet News TeluguAsianet News Telugu

వంద కోట్ల‌కు పైగా జ‌నాభాలో కేవ‌లం 5 శాతం పాస్‌పోర్టులు

  • కేవలం 5.15 శాతం పాస్ పోర్టులు మాత్రమే
  • గత రెండు సంవత్సరాలు బాగా పెరిగాయి.
  • 2 కోట్లకు పైగా విదేశీ ప్రయాణికులు
above 130 crores people had only 5 percent passports

భార‌త జ‌నాభా నేడు 130 కోట్లు దాటింది. అందులో కేవ‌లం 5.15 శాతం ప్ర‌జ‌ల‌కు మాత్ర‌మే పాస్‌పోర్టులు ఉన్నాయి. ఆదే విష‌యాన్ని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. గతంలో కన్న రెండు సంవత్సరాలుగా ఇండియా పాస్ పోర్టులు బాగా పెరిగాయి అని కేంద్రం తెలిపింది.

భార‌త‌దేశంలో కేవలం 5.15 శాతం మాత్ర‌మే పాస్ పోర్టులు అంటే 6.8 కోట్లు అని తెలుస్తుంది. 2014 వరకు ఇండియాలో పాస్ 3.7 కోట్ల పాస్‌పోర్టులు ఉన్నాయి. అయితే2015 లో వ‌చ్చిన నూతన నిబంధ‌ల‌తతో కోటికి పైగా పాస్ పోర్టులు జారీ అయ్యావ‌ని తెలిపింది. 2016 లో నిబంధ‌న‌ల‌ను మ‌రింత స‌రిళీకృతం చేయ్య‌డంతో కోటికి పైగా నూత‌న పాస్‌పోర్టులు తీసుకున్నార‌ని ప్ర‌శ్న‌కు స‌మాధానం తెలిపింది. 

కానీ 2016 సంవ‌త్స‌రంలో 1.3 కోట్ల పాస్‌పోర్టులు గ‌డువు ముగిసింద‌ని అందులో కేవ‌లం 40 ల‌క్ష‌ల మంది మాత్ర‌మే తిరిగి త‌మ పాస్ పోర్టును పున‌రుద్ద‌రించుకున్నార‌ని పెర్కొన్నారు.2001 నుండి ఇప్ప‌టి వ‌ర‌కు ఇండియా నుండి విదేశాల‌కు వెళ్లీన భార‌తీయులు ప్ర‌యాణాల సంఖ్య రెండు కోట్లని తెలిపింది.అందులో గ‌ల్ఫ్ దేశాల‌కు అధికంగా ప్ర‌యాణించినట్లు కేంద్ర పెర్కొంది.

Follow Us:
Download App:
  • android
  • ios