Asianet News TeluguAsianet News Telugu

‘దంగల్’ లైసెన్స్ ను రెండోసారి పొడిగించిన చైనా

‘దంగల్ ’ సినిమా లైసెన్స్ ను చైనా పొడిగించింది.  ఇది ఒక భారతీయ చిత్రానికి దొరికిన అరుదైన గౌరదవం. తాజా నిర్ణయం ప్రకారం చైనాలో ఆమీర్ ఖాన్ ‘దంగల్’ ఆగస్టు మొదటి  వారం దాకా ఆడించవచ్చు.  చైనా దంగల్ లైసెన్స్ ను పొడిగించడం ఇది రెండవ సారి. మామాలూగా చైనా ప్రభుత్వం  ఒక నెల రోజులకు మాత్రమే విదేశీ సినిమాలను ఆడించేందు అనుమతినిస్తుంది.

Aamirs dangal given second extension in china till August first week

 

‘దంగల్ ’ సినిమా లైసెన్స్ ను చైనా పొడిగించింది.  ఇది ఒక భారతీయ చిత్రానికి దొరికిన అరుదైన గౌరదవం. తాజా నిర్ణయం ప్రకారం చైనాలో ఆమీర్ ఖాన్ ‘దంగల్’ ఆగస్టు మొదటి  వారం దాకా ఆడించవచ్చు.  చైనా దంగల్ లైసెన్స్ ను పొడిగించడం ఇది రెండవ సారి. మామాలూగా చైనా ప్రభుత్వం  ఒక నెల రోజులకు మాత్రమే విదేశీ సినిమాలను ఆడించేందుకు అనుమతినిస్తుంది.

 

చైనా రెండోసారి పొడిగించిన విషయాన్ని మూవీ పరిశీలకుడు రమేశ్ బాల ట్వీట్ చేశారు.

 

ఇపుడున్న విధానం ప్రకారం చైనా నాలుగు భారతీయ చిత్రాలతో కలిపి ఏడాదికి 34 సినిమాలను మాత్రమే దేశంలో ప్రదర్శించనందుకు అనుమతినిస్తుంది. ఇపుడు దంగల్ కు మరొక నెల రోజులు గడువిస్తూ చైనా ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ నెలలో ఆమీర్ తో పాటు, దంగల్  డైరెక్టర్ నితిష్ తివారి చైనాలో పర్యటించి చిత్రాని ప్రమోట్ చేశారు. చైనాలో మొత్తం 40 వేల ధియోటర్లున్నాయి. చైనాలో దంగల్ చిత్రం ‘షుయ్ జియావో బాబా’(కుస్తీ పడదాం, నాయనా) అనే పేరుతో రిలీజయింది.

 

మరొక నెల రోజులు గడువు పొడిగించడంతో  దంగల్ కలెక్షన్ రు.2000 కోట్లు దాటుతుందని అంతా అనుకుంటున్నారు. కారణం, దంగల్ లెసెన్స్ పొడిగించడంతో చైనా కలెక్షన్ పెరుగుతుంది. జూన్ లో ఒకసారి దంగల్ లెసెన్స్ ను పొడిగిస్తూజూలై 4  దాకా ప్రదర్శించేందుకు అనుమతిచ్చారు. ఇపుడు మరొక సారి ఆగస్టు 4 దాకా పొడిగించారు. ఈ చిత్రం చైనాలో  మే 5,2017న  9 వేల ధియోటర్లలో విడుదలయింది.  ఇప్పటి దాాకా దంగల్ వసూలు రు. 1864 కోట్లు.

Follow Us:
Download App:
  • android
  • ios