ప్రపంచవ్యాప్తంగా రికార్డులు  తిరగరాస్తున్న బాహుబలికి నిజంగా ఇది ఎదరుదెబ్బే.. జక్కన సినిమాకు అమీర్ ఖాన్ దంగల్ ఇప్పుడు సరికొత్త సవాలు విసురుతోంది. ఎటునుం‘చైనా’ వచ్చి తానే నెంబర్ వన్ కావాలనుకుంటున్న అమీర్ ఖాన్ ఇప్పటికే దంగల్ తో ఓ బాహుబలి రికార్డును బద్దలుకొట్టాడు.   

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ తాజా చిత్రం దంగల్ సృష్టించిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు...ఆ సినిమాలో మల్లయోధుడిగా మెప్పించిన అమీర్ ఖాన్ సినిమా వసూళ్ల లలో రికార్డులను తిరగరాశాడు.

అయితే బాహుబలి 2 రాకతో పీకే, దంగల్ రికార్డులన్నీ కొట్టుకపోయాయి. అయితే ఆ సవాల్ ను అమీర్ చాలా సీరియస్ గా తీసుకున్నాడనుకుంటా.. బాహుబలికి దంగల్ తోనే సమాధానం చెప్పేందుకు రెడీ అవుతున్నాడు. ఇందుకోసం దంగల్ టీం చైనా ను ఉపయోగించుకుంటుంది.


ఇంతకీ విషయం ఏంటంటే...

గతేడాది బాలీవుడ్ లో సంచలన విజయం సాధించిన దంగల్ ను ఇప్పుడు చైనాలో రిలీజ్ చేశారు.

ప్రపంచంలోనే అత్యధిక జనాభాతో పాటు, అత్యధిక మంది మాట్లాడే చైనా భాషలో అమీర్ దంగల్ ఈ రోజే 9 వేళ థియేటర్లలో రిలీజ్ అయింది.

ఇప్పటి వరకు బాహుబలి 2 మాత్రమే ప్రపంచవ్యాప్తంగా 8 వేళ థియేటర్లలో రిలీజ్ అయి రికార్డు సృష్టించింది. ఆ రికార్డును ఇప్పుడు దంగల్ సింగల్ దెబ్బతో తుడిచేసింది.

దీనిపై చిత్ర నిర్మాత అమ్రిత్ పాండే మాట్లాడుతూ.. మన దేశం నుంచి అత్యధిక థియేటర్లలో రిలీజ్ అవుతున్న మొదటి చిత్రం ఇదే కావడం గర్వంగా ఉంది. చైనాలో 9 వేల థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ చేస్తున్నాం. మా సినిమా కథకు బౌగోళిక సరిహద్దులు లేవు అందుకే ప్రపంచమంతా మా సినిమాను ఆదరిస్తారని పేర్కొన్నారు.

అమీర్ ఖాన్ కు చైనాలోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. గతంలో ఆయన నటించిన పీకే సినిమా చైనాలో 4 వేల థియేటర్లలో రిలీజ్ అయి రూ. 100 కోట్ల వసూళ్లు సాధించింది.

ఇప్పుడు దంగల్ ఆ రికార్డులను మాత్రమే కాకుండా బాహుబలి వసూళ్లను కూడా అధిగమిస్తుందని చిత్ర బృందం భావిస్తోంది. అదే జరిగితే బాహుబలి రికార్డులన్నీ బద్దలైనట్లే.