ఇప్పటివరకు రికార్డయిన వాటిలో దక్షిణార్ధగోళంలో అతి పెద్దదైన రాకాసి అల ఇది. 23.8 మీటర్లు (78 అడుగుల) ఎత్తులో వచ్చిందీ అల. అంటే సుమారు ఓ 8 అంతస్తుల బిల్డింగ్ అంత ఎత్తు ఇది. దక్షిణ మహాసముద్రంలో పెను తుఫాను సందర్భంగా ఈ అల ఏర్పడింది. న్యూజిలాండ్‌కు దక్షిణాన 700 కిలోమీటర్ల దూరంలో ఉండే క్యాంప్‌బెల్ దీవి సమీపంలో ఈ రాకాసి అల కనిపించినట్లు మెట్‌ఓషన్ సొల్యూషన్స్ సంస్థ వెల్లడించింది. 2012లో ఇదే దక్షిణార్ధ గోళంలో 22.03 మీటర్ల ఎత్తులో వచ్చిన అల రికార్డును ఇది బద్ధలు కొట్టింది.