సైంటిస్టు ఉద్యమకారుడు పిఎం భార్గవకు నివాళి

a tribute to professor pm bhargava the founder of ccmb hyderabad
Highlights

ఈ మధ్య కాలంలో శాస్త్ర రంగం,సమాజంలలో పెరిగిపోతున్న ఆశాస్రీయ ధోరణులతో ఇంతగా పోరాటం చేసిన శాస్త్రవేత్త మరొక లేరు.ఇలాంటి ధోరణులనుంచి దేశాన్ని కాపాడేందుకు, ఇలాంటి హత్యల పట్ల ఉదాసీనంగా వ్యవహరింస్తున్న ప్రభుత్వానికి నిరసన తెలుపుడు అవార్డ వాపసీ( అవార్డులను వాపసు చేయండి) ఉద్యమానికి నాయకత్వం వహించారు.

 

జ్యోతిషం, చేప మందు వంటి మూఢనమ్మకాల మీద,దేశంలో కొన్ని వర్గాల మీద సాగుతన్న  అసహనంమీద, బిటికాటన్ వంటి జెన్యూమార్పిడి పంటల మీద రాజీలేని పోరాటం చేసిన ప్రొఫెసర్ పుష్ఫ మిత్ర భార్గవ మంగళవారం నాడు కన్ను మూశారు.  ఆయన వయసు 89 సంవత్సరాలు. హైదరాబాద్ ఉప్పలోని తన నివాసంలో జ్వరంతో బాధపడుతూ ఆయన చనిపోయారు.చాలా కాలంగా ఆయనకు డయాలిస్ కూడా జరుగుతూ ఉంది. ఆగస్టు మూడో తేదీన అంత్యక్రియలు జరుగుతాయి.

ఈ మధ్య కాలంలో శాస్త్ర రంగం,సమాజంలలో పెరిగిపోతున్న ఆశాస్రీయ ధోరణులతో ఇంతగా పోరాటం చేసిన శాస్త్రవేత్త మరొక లేరు. కర్నాటక హేతువాది కలబుర్గిని,  ఉత్తర ప్రదేశ్ దాద్రిలో మహమ్మద్ అఖ్లక్ను దుండగులు చంపేసినపుడు జరిగిన దేశ వ్యాపిత నిరసనఉద్యమం ముందు నిలబడింది ప్రొఫెసర్ భార్గవయే. ఇలాంటి ధోరణులనుంచి దేశాన్ని కాపాడేందుకు, ఇలాంటి హత్యల పట్ల ఉదాసీనంగా వ్యవహరింస్తున్న ప్రభుత్వానికి నిరసన తెలుపుతూ అవార్డు  వాపసీ( అవార్డులను వాపసు చేయండి)  ఉద్యమానికి నాయకత్వం వహించారు. జన్యు పరిశోధనలో తనకు భారత ప్రభుత్వం అందించిన పద్మభూషణ్ అవార్డును వాపసు చేశారు. హైదరాబాద్ లో  సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్  మాలెక్యులర్ బయాలజీ (సిసిఎంబి) స్థాపించింది ఆయనే. అంతకు ముందు దేశంలో ఈ రంగం పరిశోధనలు వూపందుకోలేదు.సిసిఎం బి స్థాపనతో భారతదేశం జన్యు పరిశోధనలో అగ్రశ్రేణికి వచ్చింది.

నిజానికి ఆయన రసాయన శాస్త్రవేత్త. లక్నోవిశ్వవిద్యాలయం నుంచి పిహెచ్ డి పొందారు. తర్వాత సిఎస్ ఐఆర్ శాస్త్రవేత్తగా చేరారు.1950లో ఆయన హైదరాబాద్ కు బదిలీ అయి వచ్చారు. 1950 నుంచి 1953 వరకు ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ (ఐఐసీటీ)లో, అదే సమయంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం కెమిస్ట్రీ విభాగంలో లెక్చరర్‌గా విధులు నిర్వహించారు. తర్వాత పోస్టు డాక్టొరల్ పరిశోధన కోసం అమెరికా విస్కాన్సిన్ లోని మెక్ అర్డిల్ మెమోరియల్ లాబొరేటరీ ఆఫ్ క్యాన్సర్ లో చేరారు. తిరిగి 1958లో భారత్ వచ్చి హైదరాబాద్ సిఎస్ ఐ ఆర్ ల్యాబోరేటరీలోనే చేరారు. తన అమెరికా జన్యుసంబంధ పరిశోధనలఅనుభవంతో ఆయన 1977లో సిసిఎంబి స్థాపించారు. డైరెక్టర్ అయ్యారు.  13 సంవత్సరాలు  అదే పదవిలో కొనసాగి, సిసిఎంబి ని ఒక అంతర్జాతీయపరిశోధనా కేంద్రం స్థాయికి తీసుకువచ్చారు. కణం, డిఎన్ఎ, మాలిక్యులార్ బయాలజీ పరిశోధనల్లో భారతదేశాన్ని అగ్రశ్రేణి దేశంగా మార్చారు.

ఫ్రొఫెసర్ భార్గవ, ల్యాబొరేటరీ, ఇల్లు మధ్య తిరిగే ఉద్యోగి శాస్త్రవేత్త కాదు. ఆయన సామాజిక మేధావి. బాధ్యతెరిగిన శాస్త్రవేత్త. అందకే పరిశోధనలనుంచి రిటైరయ్యాక, పెన్షన్ తీసుకుంటూ కాలం వెల్లబుచ్చలేదు. ఉద్యమకారుడయ్యాడు.  బహుళజాతి విత్తన కంపెనీలను అనుమతించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. జెనిటికల్లీ మాడిఫైడ్ పంటలను కూడా తీవ్రంగా వ్యతిరేకించారు. వీటివల్ల ప్రజల ఆరోగ్యం పాడవుతుందని, వీటని అనుమంతించాలంటే దశాబ్దాల పరిధోథన డేటా అవసరమనేవారు. ఈ వాదనతో ఆయన కేసు లు వేశారు. విధాన పరంగా ప్రభుత్వం స్థాయిలో పోరాడారు.

ప్రభుత్వం మీద వత్తిడి తీసుకువచ్చి విధానాలను శాస్త్రీయత వైపు మళ్లించడంలో ఆయన దిట. 1977 కు ముందుకు భారత దేశంలో సెల్, డిఎన్ఎ, మాలిక్యులార్ బయాలజీ లో ఒక లాబొరేటరీ లేదు. ప్రభుత్వాన్ని వప్పించి, సిసిఎంబిని హైదరాబాద్ లో ఏర్పాటుచేయించారు.అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ(రెగ్యులేషన్)  బిల్ 2013 డ్రాఫ్టింగ్ కమిటీలో ఆయన సభ్యుడు. ఈ బిల్లును రూపొందిచేందుకు దాదాపు 15 సంవత్సరాలు ఆయన ఉద్యమంలాగా పనిచేశారు. శాసన సభ్యులను, ఎంపిలను కలసి దాని ఆవశ్యకత గురించి చెప్పారు.

అద్దెగర్భాల (సరొగసీ)ని ఆయన సమర్థించేవారు. సరొగసీని నిషేధించడం ఆయనకు ఇష్టం లేదు. అయితే, అద్దె తల్లుల హక్కులకు పూర్తి రక్షణ కల్పించాలని వాదించేవారు. హైదరాబాద్‌ చేప మందు శాస్త్రీయతను సవాల్‌ చేశారు.  జన విజ్ఞాన వేదిక చేపట్టిన అన్ని ఆందోళన కార్యక్రమాల్లో భార్గవ పాల్గొన్నారు. మందుకు వ్యతిరేకంగా హైకోర్టుకు వెళ్లారు. చివరకు దాన్నిమందుగా పరిగణించరాదని, చేప ప్రసాదంగానే భావించాలని కోర్టుచెప్పింది.

1928 ఫిబ్రవరి 22న రాజస్తాన్‌లోని అజ్మీర్‌లో భార్గవ జన్మించారు. ఆయన తండ్రి రామచంద్ర భార్గవ, తల్లి గాయత్రీ భార్గవ.ఆయనకొక కుమారుడు  మెహిత్ , ఒక కూతరు వనీత ఉన్నారు.

loader